సాహో ప్రభాస్ చిరకాల కోరిక తీర్చిన బాలయ్య భామ...ఏంటో తెలుసా...?

రవీనాతో కలిసి బాలివుడ్ సూపర్ హిట్ సాంగ్ టిప్ టిప్ బర్సా పానీ పాటకు డాన్స్ చేయాలని తన మనసులో కోరికను ప్రభాస్ బయటపెట్టాడు. అంతేకాదు రవీనాను ప్రభాస్ ఏకంగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆటపట్టించాడు. అనంతరం ఇద్దరూ కలిసి స్టేజ్ మీద స్టెప్పులేశారు.

news18-telugu
Updated: August 25, 2019, 9:12 PM IST
సాహో ప్రభాస్ చిరకాల కోరిక తీర్చిన బాలయ్య భామ...ఏంటో తెలుసా...?
(instagram)
  • Share this:
సాహో సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఎలాగైనా సాహోతో సినిమా హిట్ కొట్టి బాలివుడ్ బాద్షా అవ్వాలని డార్లింగ్ టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే సాహో ప్రమోషన్ కోసం హిందీ టెలివిజన్ ఛానెల్స్ రియాలిటీ డాన్స్ షో నచ్ బలియేలో గెస్ట్ గా హాజరయ్యాడు. అంతేకాదు ఈ షోలో హాజరైన ప్రభాస్ తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. అదేంటో తెలుసా...నచ్ బలియే షోలో ప్రముఖ బాలివుడ్ నటి రవీనా టండన్ జడ్జీగా ఉన్నారు. అయితే రవీనాతో కలిసి బాలివుడ్ సూపర్ హిట్ సాంగ్ టిప్ టిప్ బర్సా పానీ పాటకు డాన్స్ చేయాలని తన మనసులో కోరికను ప్రభాస్ బయటపెట్టాడు. అంతేకాదు రవీనాను ప్రభాస్ ఏకంగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆటపట్టించాడు. అనంతరం ఇద్దరూ కలిసి స్టేజ్ మీద స్టెప్పులేశారు. ప్రభాస్ రవీనాతో కలిసి వేసిన స్టెప్పులతో ప్రోగ్రామ్ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో ప్రభాస్ ఇలా టెలివిజన్ షోలలో ఇంత యాక్టివ్ గా కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మరోవైపు ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న రవీనా టండన్ గతంలో తెలుగులో బాలకృష్ణతో కలిసి బంగారు బుల్లోడు సినిమాలో నటించింది. అలాగే రవీనా టండన్ టాలివుడ్ లో ప్రముఖ హీరోలతో కలిసి నటించడం విశేషం.First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>