ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సాహో’ షూటింగ్‌కు గుమ్మ‌డికాయ్..

సాహో సినిమా షూటింగ్

బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చాడు ప్ర‌భాస్.. ఇప్ప‌ట్నుంచి క‌నీసం ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను.. ఇక‌పై వేగం పెంచేస్తాను చూసుకోండంటూ మాటిచ్చాడు.

  • Share this:
బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చాడు ప్ర‌భాస్.. ఇప్ప‌ట్నుంచి క‌నీసం ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను.. ఇక‌పై వేగం పెంచేస్తాను చూసుకోండంటూ మాటిచ్చాడు. అయితే ప్ర‌భాస్ మాటిచ్చినా కూడా ద‌ర్శ‌కులు మాత్రం దాన్ని సీరియ‌స్‌గా తీసుకోలేదు. దాంతో బాహుబ‌లి 2 వ‌చ్చి రెండేళ్లు దాటినా కూడా ఇప్ప‌టికీ ప్ర‌భాస్ మ‌రో సినిమా విడుద‌ల చేయ‌లేక‌పోయాడు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న సాహో సినిమా రెండేళ్ల త‌ర్వాత షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికోసం ఏకంగా 25 నెల‌లు ప‌ట్టింది.
Saaho movie shooting completed after 25 months long journey and Prabhas posted the pics in Social media pk.. బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చాడు ప్ర‌భాస్.. ఇప్ప‌ట్నుంచి క‌నీసం ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను.. ఇక‌పై వేగం పెంచేస్తాను చూసుకోండంటూ మాటిచ్చాడు. prabhas,prabhas twitter,prabhas facebook,saaho shooting completed,prabhas saaho shooting completed,prabhas shraddah kapoor,saaho movie shooting,prabhas saaho,saaho movie,prabhas,prabhas new movie,saaho telugu movie,saaho movie teaser,saaho,saaho teaser,saaho shooting,prabhas saaho teaser,saaho trailer,prabhas saaho movie,prabhas saaho movie teaser,prabhas to participate in saaho movie shoot,prabhas about saaho movie,sahoo movie teaser,prabhas sahoo movie,rebel star prabhas to participate in saaho movie shoot,bahubali 2 movie,telugu cinema,సాహో,సాహో ప్రభాస్,ప్రభాస్ సాహో షూటింగ్ పూర్తి,ప్రభాస్ శ్రద్దాకపూర్,తెలుగు సినిమా
సాహో స్టిల్స్

ఇదే విష‌యాన్ని ప్ర‌భాస్ కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు. సాహో షూటింగ్ చివ‌రి రోజు ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు ఈ హీరో. ఈ ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. 2017 జూన్ 9న 'సాహో' షూటింగ్ మొదలైంది. 2019 జులై 15తో ఈ చిత్ర‌ షూటింగ్ పూర్తయింది. అంటే దాదాపు 25 నెలలు ప‌ట్టింది ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ పూర్తి చేయ‌డానికి. ముందు ఏడాదిన్న‌ర అనుకున్నారు కానీ రానురాను యాక్ష‌న్ సీన్స్ పెరిగిపోవ‌డం.. మ‌ధ్య‌లో కొన్నిసార్లు షూట్ ఆల‌స్యం కావ‌డంతో ఇన్నేళ్లు ప‌ట్టింది.ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కావ‌డంతో డబ్బింగ్ పనులు జ‌రుగుతున్నాయి. దీనికోసం భారీగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ వాడుకుంటున్నారు. అనుకున్న‌ట్లుగానే ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి ఈ సినిమాతో ప్ర‌భాస్ ఇండియ‌న్ సినిమా బాక్సాఫీస్‌ను ఎంత‌వ‌ర‌కు షేక్ చేస్తాడో చూడాలి. సుజీత్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్.
Published by:Praveen Kumar Vadla
First published: