సల్మాన్,షారుఖ్, ఆమీర్ సాధించలేనది.. ప్రభాస్ సాధించి చూపించాడు..

షారుఖ్,సల్మాన్,ఆమీర్, ప్రభాస్ (File/Photos)

అవును బాలీవుడ్ బడా హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్‌లు సాధించలేనిది ఇపుడు ప్రభాస్ సాధించి చూపెట్టాడు.

  • Share this:
    అవును బాలీవుడ్ బడా హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్‌లు సాధించలేనిది ఇపుడు ప్రభాస్ సాధించి చూపెట్టాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ హిట్టు కోసం మొఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్నాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ తర్వాత ఆ స్థాయి హిట్ అన్నదే లేదు. మరోవైపు ఆమీర్ ఖాన్..‘దంగల్’ వంటి సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నా ఆ తర్వాత అదే ఊపును కంటిన్యూ చేయడం లేదు. ఇంకోవైపు సల్మాన్ ఖాన్.. చెత్త రివ్యూలతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొడుతున్న సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోతున్నాడు. కానీ తెలుగు హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. వరుసగా ‘బాహుబలి 1’, బాహుబలి 2’ తో పాటు తాజాగా ‘సాహో’తో వరుసగా రూ.350 కోట్లను అందుకున్న తొలి భారతీయ హీరోగా రికార్డులకు ఎక్కాడు.

    ‘సాహో’తో వరుసగా రూ.350 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోగా ప్రభాస్ రికార్డు


    ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలకు మాత్రమే పరిమితమైన వందల కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా రాబట్టేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రూ.350 కోట్లను రాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్టడీగా రన్ అవుతూనే ఉంది. ఏమైనా ఒక తెలుగు హీరో అయివుండి.. జాతీయ స్థాయిలో ఈ రకమైన వసూళ్లతో బీటౌన్ హీరోలకు ప్రకంపనలు పుట్టిస్తున్నాడు ప్రభాస్. ఏమైనా ప్రభాస్ అందుకున్న ఈ ఫీట్‌కు నిజంగానే ‘సాహో’ అనాల్సిందే.
    First published: