‘సాహో’ కలెక్షన్స్.. నిర్మాతలకు లాభం.. డిస్ట్రిబ్యూటర్లకు నష్టం..

బాహుబలి 2 సినిమా 2000 కోట్లకు పైగా వసూలు చేస్తే ఔరా అంటూ అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ ప్రభాస్ సరిగ్గా క్యాష్ చేసుకోడానికి మరోసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 5:14 PM IST
‘సాహో’ కలెక్షన్స్.. నిర్మాతలకు లాభం.. డిస్ట్రిబ్యూటర్లకు నష్టం..
సాహో దర్శకుడు సుజీత్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 5:14 PM IST
బాహుబలి 2 సినిమా 2000 కోట్లకు పైగా వసూలు చేస్తే ఔరా అంటూ అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ ప్రభాస్ సరిగ్గా క్యాష్ చేసుకోడానికి మరోసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసాడు. ఈ సారి సాహో అంటూ మరోసారి భారీ బడ్జెట్ సినిమాతోనే వచ్చాడు. ఈ చిత్రం మూడు వారాల కింద విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల సినిమా ఫైనల్ రన్‌కు వచ్చేసింది. ఈ 20 రోజుల్లో సాహో దాదాపు 424 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలే తెలిపారు. కానీ బయట మాత్రం పరిస్థితి అలా లేదని.. నిర్మాతలకు నష్టాలు రాకపోయినా కూడా బయ్యర్లు మాత్రం దారుణంగా నష్టపోయారనే ప్రచారం జరుగుతుంది.
Saaho movie closing collections and Prabhas movie profits to producers and Losses to distributors pk బాహుబలి 2 సినిమా 2000 కోట్లకు పైగా వసూలు చేస్తే ఔరా అంటూ అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ ప్రభాస్ సరిగ్గా క్యాష్ చేసుకోడానికి మరోసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసాడు. saaho,saaho movie,saaho movie twitter,saaho movie collections,saaho collections,saaho 400 crores,saaho 400 crore collections,prabhas saaho,prabhas saaho collections,telugu cinema,సాహో,ప్రభాస్ సాహో,సాహో కలెక్షన్స్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,తెలుగు సినిమా
సాహో 400 కోట్లు (Source: Twitter)

'సాహో' సినిమాను 350 కోట్లతో నిర్మించామని పదే పదే చెబుతూ వచ్చారు నిర్మాతలు. అయితే విడుదలైన తర్వాత తొలిరోజు నుంచే ఇంత వసూలు చేసిందంటూ పోస్టర్లు విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 2 వారాల్లోనే తమ సినిమా 420 కోట్లు దాటిందని చెప్పడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు చూసుకుంటే కేవలం హిందీలో మాత్రమే ఈ చిత్రం హిట్ అయింది. అక్కడ 150 కోట్ల వరకు నెట్ తీసుకొచ్చింది.. షేర్ కూడా బాగానే వసూలు చేసింది.

Saaho movie closing collections and Prabhas movie profits to producers and Losses to distributors pk బాహుబలి 2 సినిమా 2000 కోట్లకు పైగా వసూలు చేస్తే ఔరా అంటూ అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ ప్రభాస్ సరిగ్గా క్యాష్ చేసుకోడానికి మరోసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసాడు. saaho,saaho movie,saaho movie twitter,saaho movie collections,saaho collections,saaho 400 crores,saaho 400 crore collections,prabhas saaho,prabhas saaho collections,telugu cinema,సాహో,ప్రభాస్ సాహో,సాహో కలెక్షన్స్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,తెలుగు సినిమా
‘సాహో’ మూవీ కలెక్షన్స్

తెలుగులో మాత్రం 120 కోట్ల బిజినెస్ చేస్తే.. 80 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అయితే చాలా ఏరియాల్లో అడ్వాన్స్ బేసిస్‌లో సినిమాను అమ్మడంతో డిస్ట్రిబ్యూటర్లు గోల పెట్టడం లేదు. అందులో పోయిన మొత్తం కొంత వరకు నిర్మాతల నుంచి వెనక్కి వచ్చేస్తుంది. అయితే తమిళ, మళయాలంలో మాత్రం సాహో దారుణంగా నిరాశ పరచింది. ఇక ఓవర్సీస్ మార్కెట్ సైతం సాహో ముంచేసింది. అక్కడ ఓ అంతర్జాతీయ సంస్థ 42 కోట్లకు సాహోను కొనుగోలు చేసింది.
Saaho movie closing collections and Prabhas movie profits to producers and Losses to distributors pk బాహుబలి 2 సినిమా 2000 కోట్లకు పైగా వసూలు చేస్తే ఔరా అంటూ అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ ప్రభాస్ సరిగ్గా క్యాష్ చేసుకోడానికి మరోసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసాడు. saaho,saaho movie,saaho movie twitter,saaho movie collections,saaho collections,saaho 400 crores,saaho 400 crore collections,prabhas saaho,prabhas saaho collections,telugu cinema,సాహో,ప్రభాస్ సాహో,సాహో కలెక్షన్స్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,తెలుగు సినిమా
‘సాహో’ (twitter/Photo)వాళ్లే యూఎస్ఏతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా రైట్స్ విడివిడిగా అమ్మేసారు. దాంతో ఇక్కడ నిర్మాతలకు వాళ్లతో సంబంధం లేదు. అంటే ఓవర్సీస్ నష్టాలు కూడా అక్కడి సంస్థే భరించాల్సి వస్తుంది. బయ్యర్ల పరిస్థితి ఎలా ఉన్నా కూడా నిర్మాతలకు మాత్రం సాహో మంచి లాభాలే తీసుకొచ్చింది. డిజిటల్, శాటిలైట్, ఆడియో అన్నీ కలిపి ఈ సినిమా నుంచి భారీ లాభాలే వచ్చాయి. మొత్తంగా సాహో డిజాస్టర్ అయితే కాదు.. కానీ కచ్చితంగా కొన్ని ఏరియాల్లో ఫ్లాప్ అయితే అయింది. ఒప్పుకోడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. మరి దీనిపై ప్రభాస్ ఏమంటాడో చూడాలి.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...