‘సాహో’ అమ్మింది 290 కోట్లు.. ఇప్పటి వరకు వచ్చింది ఎంతో తెలుసా..?

సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఇప్పటికే 6 రోజులు పూర్తైపోయాయి కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 5, 2019, 8:11 PM IST
‘సాహో’ అమ్మింది 290 కోట్లు.. ఇప్పటి వరకు వచ్చింది ఎంతో తెలుసా..?
సాహో చిత్రంలో దృశ్యం (Image:Lisaraniray/Instagram)
  • Share this:
సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఇప్పటికే 6 రోజులు పూర్తైపోయాయి కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. టాక్‌తో పని లేకుండా ఈ చిత్రం 6 రోజుల్లోనే 189 కోట్లు షేర్ తీసుకొచ్చింది. ఇప్పటికే బాహుబలి 1,2, 2.0 సినిమాల తర్వాత సౌత్ ఇండియాలో నాలుగో స్థానంలో ఉంది ఈ సినిమా. అయితే తొలి 6 రోజుల్లో 4 రోజులు హాలీడేస్ ఉండటంతో భారీ వసూళ్లు అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాత వీక్ డేస్ మొదలు కాగానే సినిమా కూడా వీక్ అయిపోయింది. దాంతో బయ్యర్లకు కూడా టెన్షన్ మొదలైంది.
Saaho movie 6 days WW collections and Prabhas movie need to go long way pk సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఇప్పటికే 6 రోజులు పూర్తైపోయాయి కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. saaho,saaho movie collections,saaho movie 6 days collections,saaho movie,saaho movie twitter,prabhas movie saaho,prabhas twitter,prabhas saaho collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,సాహో కలెక్షన్స్,సాహో 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
‘సాహో’ మూవీ కలెక్షన్స్

ఈ చిత్రం 290 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఇంకా దాదాపు 100 కోట్లు వసూలు చేయాలి. రెండో వారం కూడా తెలుగులో ఏ భారీ సినిమా లేదు.. దాంతో కచ్చితంగా మరికొన్ని వసూళ్లు రావడం ఖాయం. అయితే తెలుగులో ఈ చిత్రం 124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఆరు రోజుల్లో వచ్చిన మొత్తం 75 కోట్ల షేర్ మాత్రమే. అంటే ఇంకా 50 కోట్లు వెనకబడే ఉంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అన్ని కోట్లు రావడం మాత్రం కష్టంగానే అనిపిస్తుంది.

Saaho movie 6 days WW collections and Prabhas movie need to go long way pk సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఇప్పటికే 6 రోజులు పూర్తైపోయాయి కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. saaho,saaho movie collections,saaho movie 6 days collections,saaho movie,saaho movie twitter,prabhas movie saaho,prabhas twitter,prabhas saaho collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,సాహో కలెక్షన్స్,సాహో 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
‘సాహో’ (twitter/Photo)

మరోవైపు హిందీలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా ఇప్పటి వరకు భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఈ వారం మాత్రం అంత బాగా రన్ కావడం కష్టమే. ఎందుకంటే సెప్టెంబర్ 6న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే విడుదల కానుంది. దాంతో ఈ వారం సాహోకు భారీ వసూళ్లు రావడం కష్టమే. ఇక ఇప్పటికే తమిళ, మళయాలం, కన్నడలో కూడా వసూళ్లు తగ్గుమఖం పట్టాయి. దాంతో సాహో ప్రయాణం మున్ముందు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>