ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ సరసన ప్రభాస్ భామ..

తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచ‌నాలు  ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తోన్న హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తన పర్సనల్ సమస్యల వల్ల ఈ సినిమా నుంచి పక్కకు తప్పకుంటున్నట్టు ప్రకటించింది. ఇపుడామె ప్లేస్‌లో ప్రభాస్ భామను హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 15, 2019, 10:14 PM IST
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ సరసన ప్రభాస్ భామ..
ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచ‌నాలు  ఉన్నాయి. పైగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డం.. బాహుబ‌లి  సిరీస్ త‌ర్వాత సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తోన్న హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తన పర్సనల్ సమస్యల వల్ల ఈ సినిమా నుంచి పక్కకు తప్పకుంటున్నట్టు ప్రకటించింది. ఐతే  RRR నుంచి డైసీ తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. అసలు ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకోవడం రాజమౌళి అండ్ టీంకు కూడా ఊహించని షాకే. ఎందుకంటే వడోదర షెడ్యూల్ కూడా మొదలైన తర్వాత ఈ చిత్రం నుంచి డైసీ తప్పుకోవడం గమనార్హం.

Rajamouli looking for another foreign actress in RRR movie after exit of Daisy Edgar Jones pk.. RRR నుంచి హీరోయిన్ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేవలం తన పర్సనల్ సమస్యల వల్ల ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది డైసీ ఎల్గర్. దాంతో కొత్త హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. daisy edgar jones about rrr,daisy edgar jones rrr,daisy edgar jones out of rrr,rrr movie,rrr movie twitter,rrr rajamouli,jr ntr daisy edgar jones,ram charan ntr rajamouli,rrr shooting,telugu cinema,rajamouli hollywood actress,రాజమౌళి,రాజమౌళి ఆర్ఆర్ఆర్,డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్,రాజమౌళి ఎన్టీఆర్ హీరోయిన్,ఆర్ఆర్ఆర్ నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ ఔట్,తెలుగు సినిమా

దీంతో ఈ  సినిమాలో మరో హీరోయిన్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమాలో డైసీ తప్పుకోవడంతో  ఆ ప్లేస్‌లో పరిణితీ చోప్రా పేరు పరిశీలనకు వచ్చింది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ‘సాహో’ఫేమ్ శ్రద్దాకపూర్ నటించబోతున్నట్టు సమాచారం.  ప్రభాసే స్వయంగా ఆర్ఆర్ఆర్‌లో శ్రద్దాను తీసుకోమని రాజమౌళిని అడిగినట్టు సమాచారం. మరోవైపు ఆర్ఆర్ఆర్‌లో ప్రభాస్ మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్‌లో నటిస్తే.. రామ్ చరణ్..అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాలో శ్రద్దానే ఈ సినిమాలో నటించబోతుందా లేదా అనేది తెలియాలంటే ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading