హోమ్ /వార్తలు /సినిమా /

Saaho : నాలుగు రోజుల్లో 300 కోట్లు .. బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ప్రభంజనం

Saaho : నాలుగు రోజుల్లో 300 కోట్లు .. బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ప్రభంజనం

ప్రభాస్ ‘సాహో’

ప్రభాస్ ‘సాహో’

Saaho : బాక్సాఫీస్ దగ్గర... సాహో సంచలనం సృష్టిస్తోంది. సోమవారం వచ్చిన కలెక్షన్లతో  మూడు వందల కోట్ల గ్రాస్‌ మార్కుని దాటేసింది సాహో.

  Saaho : బాక్సాఫీస్ దగ్గర... సాహో సంచలనం సృష్టిస్తోంది. సోమవారం వచ్చిన కలెక్షన్లతో  మూడు వందల కోట్ల గ్రాస్‌ మార్కుని దాటేసింది సాహో. అది అలా ఉంటే సాహో తెలంగాణలో స్ట్రాంగ్‌గా రన్‌ అవుతూ వుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొంచెం వెనుకబడ్డది. అయితే హిందీ బెల్ట్‌లో మాత్రం కలెక్షన్స్ మామూలుగా లేవు.. హిందీ వెర్షన్‌కి నాలుగు రోజుల్లోనే రమారమిగా వంద కోట్ల నెట్‌ వసూళ్లు రావడం అక్కడి ట్రేడ్‌ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. హిందీలో మామూలుగా సల్మాన్‌ ఖాన్‌ సినిమాలకి మాత్రమే ఫస్ట్ వీకెండ్‌లో వంద కోట్ల నెట్‌ వసూళ్లు వస్తుంటాయి.

  అలాంటిది ఓ సౌత్ స్టార్‌కు ఇంతటి వసూళ్లు రావడం.. ఎవరికి అంతు చిక్కడం లేదు. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేయగా.. సోమవారం కలెక్షన్స్‌తో ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ సాధించి సంచలనంగా మారింది. అది అలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వర్షన్ ఇప్పటికే 60 కోట్లు దాటిపోయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 30న విడుదలైన ‘సాహో’ ను సుజీత్‌ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. శ్రద్ధా కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Prabhas saaho, Telugu Cinema News

  ఉత్తమ కథలు