#Saaho : ఫస్ట్ సాంగ్ 'సైకో సయాన్' రిలీజ్

Saaho Song Psycho Saiyaan : తాజాగా ఈ సినిమాలోని 'సైకో సయాన్' అనే మొదటి పాటను తమిళ,తెలుగు,మలయాళ,హిందీ భాషల్లో విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లోనూ పాటకు మంచి స్పందన లభిస్తోంది.

news18-telugu
Updated: July 8, 2019, 11:33 AM IST
#Saaho : ఫస్ట్ సాంగ్ 'సైకో సయాన్' రిలీజ్
సాహో ఫస్ట్ సాంగ్ పోస్టర్..
  • Share this:
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో 'సాహో' సినిమాపై అందరి దృష్టి నెలకొంది. బాహుబలితో ప్రభాస్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ కావడంతో.. సాహో సినిమా కోసం ఇప్పుడు అన్ని భాషల అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అభిమానులను నిరాశపరచకుండా
సాహో టీమ్ ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్‌ అందిస్తూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాలోని 'సైకో సయాన్' అనే మొదటి పాటను తమిళ,తెలుగు,మలయాళ,హిందీ భాషల్లో విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లోనూ పాటకు మంచి స్పందన లభిస్తోంది.పార్టీ సాంగ్ తరహాలో

చిత్రీకరించిన ఈ పాటలో శ్రద్దకపూర్‌ హాట్ హాట్‌గా కనిపిస్తోంది. ప్రభాస్ తన లుక్స్‌తో ఆకట్టుకునేలా ఉన్నాడు. అగస్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published by: Srinivas Mittapalli
First published: July 8, 2019, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading