Saaho : సాహో సినిమాపై అభిమానుల స్పందన ఇదీ..

Saaho : బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సాహో. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? అంచనాలను అందుకుందా? ప్రభాస్ మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొడతాడా? అంటే విశ్లేషకులు, సినీ అభిమానులు ఏం చెబుతున్నారంటే..

news18-telugu
Updated: August 30, 2019, 10:41 AM IST
Saaho : సాహో సినిమాపై అభిమానుల స్పందన ఇదీ..
సాహో మూవీ పోస్టర్ (Source: Twitter)
  • Share this:
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సాహో. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? అంచనాలను అందుకుందా? ప్రభాస్ మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొడతాడా? అంటే విశ్లేషకులు, సినీ అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది సినిమా ఎక్సైటింగ్‌గా ఉందని, రివ్యూలను చూసి మోసపోవద్దని చెబుతుంటే.. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ముందే అంచనా వేయవచ్చని మరికొందరు చెబుతున్నారు. హైప్ వచ్చినంతగా సినిమా లేదని వాదిస్తున్నారు. అయితే, ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటంతో ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇంకొందరైతే ఈ సినిమా ప్రభాస్‌ను హైలెట్ చేసే ఉద్దేశంతోనే సినిమా అంతా నడిచిందని చెబుతుండటం గమనార్హం.

అయితే, వాణిజ్యపరంగా సినిమా హిట్ అవుతుందా? లేదా? అన్నది మాత్రం కాలమే నిర్ణయించనుంది. కాగా, ఈ సినిమా ప్రభాస్‌కు అత్యంత కీలకం కానుంది. నేరుగా హిందీ సినీ ఇండస్ట్రీలోకి ప్రభాస్ ఈ సినిమాతోనే అడుగు పెట్టాడు. ఇదిలా ఉండగా, ట్విట్టర్‌లో సినిమాపై వస్తున్న కొన్ని ట్వీట్లను పరిశీలించినా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.








Published by: Shravan Kumar Bommakanti
First published: August 30, 2019, 10:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading