సాహో డైరెక్టర్ సుజిత్ నిశ్చితార్ధం.. హాజరైన ఇరువురు ఫ్యామిలీ మెంబర్స్..

‘సాహో’ డైరెక్టర్ సుజిత్ ఎంగేజ్మెంట్ (Facebook/Photo)

టాలీవుడ్‌లో ‘రన్ రాజా రన్’ వంటి మొదటి సినిమాతోనే అందిరి దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుజిత్. తాజాగా ఈ దర్శకుడు తన ప్రేయసిని ఈ రోజు నిశ్చితార్ధం చేసుకున్నాడు.

  • Share this:
    టాలీవుడ్‌లో ‘రన్ రాజా రన్’ వంటి మొదటి సినిమాతోనే అందిరి దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుజిత్. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌ తీసిన ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ఉంది. ఫస్ట్ మూవీతోనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ను హ్యాండిల్ చేసిన విధానం నచ్చిన హీరో ప్రభాస్.. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుజిత్‌తో ‘సాహో’ సినిమా చేసి సినీ ఇండస్ట్రీని ఆశ్యర్యపరిచేలా చేసాడు. రొటీన్ గాడ్ ఫాదర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సాహో సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచినా... డైరెక్టర్‌గా సుజిత్ టేకింగ్ మాత్రం అద్భుతమనే పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో  తను చేయబోయే ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలు సుజిత్ చేతిలో పెట్టాడు.   తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్నాడు.  తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రవల్లిక అనే యువతిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్ధం గోల్కొండ రిసార్ట్స్‌లో కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా జరిగింది.  ఇక సుజిత్ చేసుకోబోయే ప్రవల్లిక విషయాకిస్తే.. ఈమె వృత్తి రీత్యా డాక్టర్ అని చెబుతున్నారు. అంతేకాదు స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తోంది.  కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: