అర్థం కాకపోతే మళ్లీ చూడండి.. ‘సాహో’ కాపీ విమర్శలపై సుజీత్ ఫైర్..

సాహో సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ రావడాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ చిత్రం ప్రెంచ్ మూవీ లార్గోవించ్ నుండి కాపీ కొట్టి తీశాడంటూ సుజీత్‌పై సంచలన ఆరోపణలు మొదలయ్యాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 6, 2019, 5:52 PM IST
అర్థం కాకపోతే మళ్లీ చూడండి.. ‘సాహో’ కాపీ విమర్శలపై సుజీత్ ఫైర్..
సుజీత్: అక్టోబర్ 26, వయసు 30
  • Share this:
సాహో సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ రావడాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ చిత్రం ప్రెంచ్ మూవీ లార్గోవించ్ నుండి కాపీ కొట్టి తీశాడంటూ సుజీత్‌పై సంచలన ఆరోపణలు మొదలయ్యాయి. తన సినిమాపై ఇలాంటి కమెంట్స్ రావడంతో ఇప్పుడు దీనిపై స్పందించాడు సుజీత్. సాహో సినిమాని లార్గోవించ్ నుండి కాపీ కొట్టి తీశానని చాలా మంది నాపై ఆరోపణలు చేస్తున్నారు కదా.. అలాంటి వాళ్లంతా నిజంగా లార్గోవించ్ సినిమాను మాత్రం కచ్చితంగా చూసుండరని కామెంట్ చేసాడు ఈయన. తాను ఆరేళ్ల కింద చేసిన రన్ రాజా రన్ సినిమాని కాస్త మార్చి సాహో సినిమా తీశానని చెప్పాడు సుజీత్.

Saaho director Sujeeth responds over copy issue and his Sensational comments on media going viral pk సాహో సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ రావడాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ చిత్రం ప్రెంచ్ మూవీ లార్గోవించ్ నుండి కాపీ కొట్టి తీశాడంటూ సుజీత్‌పై సంచలన ఆరోపణలు మొదలయ్యాయి. saaho,saaho sujeeth,sujeeth interview,prabhas sujeeth saaho,prabhas sujeeth,saaho collections,sujeeth largo winch,sujeeth comments on negative talk,sujeeth saaho,telugu cinema,సాహో,సాహో సుజీత్,సుజీత్ ప్రభాస్,లార్గో వించ్ సుజీత్,తెలుగు సినిమా
సాహో దర్శకుడు సుజీత్ (Source: Twitter)

నాన్న చనిపోతే ఎక్కడో ఉన్న కొడుకు వచ్చి ఆయన కొడుకునే నేను అని నిరూపించుకోవడం లార్గోవించ్ కథ అంటున్నాడు సుజీత్. ఇప్పుడు తాను తీసిన సాహోకి దీనికి అసలెక్కడైనా పోలికలున్నాయా.. తండ్రి కొడుకుల నేపథ్యంలో ఏ సినిమా చేసినా కూడా అది లార్గోవించ్ అవుతుందా అంటూ ఫైర్ అయ్యాడు ఈ కుర్ర దర్శకుడు. చాలా మంది సాహోను చూసి అర్ధం లేదన్నారని.. అలాంటి వాళ్లకు అర్థం లేదనడం కాదు.. అర్థం కాలేదని చెప్పడంటూ సుజీత్ తెలిపాడు. అలాంటిప్పుడు మరోసారి సాహోను చూడండే కానీ ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేయొద్దంటున్నాడు ఈయన.

Saaho director Sujeeth responds over copy issue and his Sensational comments on media going viral pk సాహో సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ రావడాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ చిత్రం ప్రెంచ్ మూవీ లార్గోవించ్ నుండి కాపీ కొట్టి తీశాడంటూ సుజీత్‌పై సంచలన ఆరోపణలు మొదలయ్యాయి. saaho,saaho sujeeth,sujeeth interview,prabhas sujeeth saaho,prabhas sujeeth,saaho collections,sujeeth largo winch,sujeeth comments on negative talk,sujeeth saaho,telugu cinema,సాహో,సాహో సుజీత్,సుజీత్ ప్రభాస్,లార్గో వించ్ సుజీత్,తెలుగు సినిమా
సాహో దర్శకుడు సుజీత్ (Source: Twitter)

తమ సొంత అభిప్రాయాలను జనాలపై రుద్దడానికి ప్రయత్నించకూడదంటున్నాడు సుజీత్. ఈ సినిమాను చూసి బీహార్ నుంచి ఓ పెద్దాయన ఫోన్ చేసి.. ఇక్కడ నువ్వు పుట్టించే కచ్చితంగా గుడికట్టేసేవాళ్ళు అంటూ ఎమోషనల్ అయ్యాడంటున్నాడు సుజీత్. తెలుగు వాడైన తాను ఓ పాన్ ఇండియా సినిమా తీసినపుడు మన వాళ్ళు దానిని సరిగ్గా గుర్తించలేదనేది తన బాధ అంటున్నాడు సుజీత్. నిజానికి సుజీత్ అంటున్న వాదనలోనూ నిజం లేకపోలేదు. తండ్రి కొడుకుల నేపథ్యంలో సినిమా తీస్తే అది లార్గోవించ్ అయితే కాదు.. కానీ చూసిన వాళ్లకు అలా అనిపించడంతో ఆయన కూడా ఏం చేయలేకపోతున్నాడు.

Saaho director Sujeeth responds over copy issue and his Sensational comments on media going viral pk సాహో సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ రావడాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ చిత్రం ప్రెంచ్ మూవీ లార్గోవించ్ నుండి కాపీ కొట్టి తీశాడంటూ సుజీత్‌పై సంచలన ఆరోపణలు మొదలయ్యాయి. saaho,saaho sujeeth,sujeeth interview,prabhas sujeeth saaho,prabhas sujeeth,saaho collections,sujeeth largo winch,sujeeth comments on negative talk,sujeeth saaho,telugu cinema,సాహో,సాహో సుజీత్,సుజీత్ ప్రభాస్,లార్గో వించ్ సుజీత్,తెలుగు సినిమా
సాహో ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ పోస్టర్స్ (Source: Twitter)

కానీ ఏదేమైనా కూడా తెలుగు దర్శకుడు భారీ సినిమా తీసాడు కదా అని నెగిటివ్ టాక్ వచ్చినా కూడా నెత్తిన పెట్టుకోవాలంటే కాని పని. ఒకవేళ నిజంగానే సినిమా బాగుండుంటే ఇప్పుడు విమర్శిస్తున్న మీడియానే.. అప్పుడు నెత్తిన పెట్టుకునేది. రాజమౌళి లాంటి దర్శకుడైనా కూడా మంచి సినిమా చేయకపోతే రెండో రోజే మొహం చాటేస్తున్న ప్రేక్షకుల మధ్యలో ఉన్నాం మనం. అది అర్థం చేసుకోడానికి సుజీత్‌కు కాస్త టైమ్ పడుతుంది. మూడేళ్ల పాటు కష్టపడి తీసిన సినిమాను అలా అంటే ఎవరికైనా కోపం రావడం సహజమే అంటున్నారు విశ్లేషకులు.
Saaho director Sujeeth responds over copy issue and his Sensational comments on media going viral pk సాహో సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ రావడాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ చిత్రం ప్రెంచ్ మూవీ లార్గోవించ్ నుండి కాపీ కొట్టి తీశాడంటూ సుజీత్‌పై సంచలన ఆరోపణలు మొదలయ్యాయి. saaho,saaho sujeeth,sujeeth interview,prabhas sujeeth saaho,prabhas sujeeth,saaho collections,sujeeth largo winch,sujeeth comments on negative talk,sujeeth saaho,telugu cinema,సాహో,సాహో సుజీత్,సుజీత్ ప్రభాస్,లార్గో వించ్ సుజీత్,తెలుగు సినిమా
సాహో దర్శకుడు సుజీత్ (Source: Twitter)

కేవలం తన సినిమాను నెగిటివ్ రివ్యూస్ చంపేసాయి అని చెప్పడం తప్పే. ఎందుకంటే ఈ మధ్యే బాలీవుడ్‌లో విడుదలైన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాకు దారుణమైన రేటింగ్స్ ఇచ్చినా కూడా 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తానికి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిది కానీ ఇలా బాగోలేదని చెప్పినందుకు మీడియాపై అరిస్తే అది మళ్లీ తన కెరీర్‌పైనే దెబ్బ పడుతుందని సుజీత్‌కు అర్థమయ్యేలా చెబుతున్నారు సన్నిహితులు. మరి ఈ పరిస్థితులను ఈ కుర్ర దర్శకుడు ఎంతవరకు అర్థం చేసుకుంటాడో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: September 6, 2019, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading