ప్రభాస్‌ని హీరోగా ఎవరూ ఎంచుకోలేరు : యువ దర్శకుడు సుజీత్ వ్యాఖ్యలు

సాహో సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా మరో కొత్త సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సందర్బంగా ప్రెస్ మీట్ పెట్టిన చిత్ర దర్శకుడు సుజీత్‌.. ప్రభాస్ గురించి, సాహో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 3, 2019, 10:35 AM IST
ప్రభాస్‌ని హీరోగా ఎవరూ ఎంచుకోలేరు : యువ దర్శకుడు సుజీత్ వ్యాఖ్యలు
సుజీత్, ప్రభాస్ Photo : Instagram
  • Share this:
ప్రభాస్, శ్ర‌ద్ధా క‌పూర్ జంటగా సూపర్ యాక్షన్ చిత్రం ‘సాహో’ విడుదలకు సిద్దం అవుతోంది. అందులో భాగంగా వరుసగా ఈ సిినిమాకు సంబందించిన పాటల్నీ విడుదల చేస్తోంది చిత్ర బృందం. అయితే ఈ సాహో సినిమా ప్రభాస్‌ నటించిన సూపర్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’ సిరీస్ తర్వాత వస్తుండడంతో ఈ మూవీపై తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్ర సీమల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను తెరకెక్కించనట్లు ఆ మద్య విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తోంది. సాహోను ముందుగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. కానీ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా ఆగష్టు 30న విడుదల చేయనున్నట్టు ‘సాహో’చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఇటీవలే ప్రకటించింది. సినిమా విడుదల తేది దగ్గర పడడంతో సాహో బృందం సినిమా ప్రమోషన్‌ను మొదలు పెట్టింది.

అందులో భాగంగా చిత్ర యూనిట్ మరో కొత్త సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సందర్బంగా ప్రెస్ మీట్‌లో చిత్ర దర్శకుడు సుజీత్‌ మాట్లాడుతూ.. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కు ‘సాహో’ కథ బాహుబలి కంటే ముందే చెప్పానని తెలిపారు. ఓ ప్రశ్నకు సమాదానంగా సుజీత్ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్‌ని హీరోగా ఎవరూ ఎంచుకోలేరు. ఆయనే దర్శకుడ్ని ఎంచుకోవాల్సిందే అన్నారు. ప్రభాస్‌కు ‘సాహో’ కథ నచ్చడం వల్లే నా డైరెక్షన్‌లో నటిస్తున్నారు అని అనుకుంటున్నా.. అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. సాహో సినిమాను దర్శకత్వం వహించేటప్పుడు అనేక సవాళ్లు ఎదుర్కొన్నానని.. ఈ ఒక్క సినిమాతో పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చిందని పేర్కోన్నారు.
Published by: Suresh Rachamalla
First published: August 3, 2019, 10:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading