‘సాహో’ సుజీత్ తర్వాతి సినిమా ఏంటి.. రాజమౌళి దారిలో వెళ్తున్నాడా..?

అవును.. నమ్మడానికి కొత్తగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే రాజమౌళి దారిలో వెళ్తున్నాడు సుజీత్. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సుజీత్. సాహో సినిమాతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 23, 2019, 10:41 PM IST
‘సాహో’ సుజీత్ తర్వాతి సినిమా ఏంటి.. రాజమౌళి దారిలో వెళ్తున్నాడా..?
రాజమౌళి సుజీత్ (Source: Twitter)
  • Share this:
అవును.. నమ్మడానికి కొత్తగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే రాజమౌళి దారిలో వెళ్తున్నాడు సుజీత్. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సుజీత్. సాహో సినిమాతో ఈయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన బెడితే 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమాను హ్యాండిల్ చేసాడు సుజీత్. ఇదే ఇప్పుడు మనోడి క్రేజ్ పెంచేసింది. ఇంత తక్కువ సమయంలో అలాంటి ఓ స్క్రిప్ట్ రాసుకుని.. అన్ని వందల కోట్లు పెట్టించడానికి నిర్మాతలను ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు.

Saaho director Sujeeth following SS Rajamouli foot steps for his next movie pk అవును.. నమ్మడానికి కొత్తగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే రాజమౌళి దారిలో వెళ్తున్నాడు సుజీత్. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సుజీత్. సాహో సినిమాతో ఈయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. saaho,saaho movie,saaho movie collections,sujeeth,sujeeth sign,sujeeth movies,sujeeth saaho,sujeeth saaho movie,sujeeth next movie,sujeeth rajamouli,telugu cinema,సుజీత్,సుజీత్ సైన్,సుజీత్ నెక్ట్స్ మూవీ,సుజీత్ రాజమౌళి,తెలుగు సినిమా
సామో డైరెక్టర్ సుజిత్, ప్రభాస్


సాహో టాక్‌తో పనిలేకుండా 230 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఈ చిత్రం.. బయ్యర్లకు మాత్రం భారీ నష్టాలు తీసుకొచ్చింది. హిందీలో మాత్రం ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అక్కడ 150 కోట్లకు పైగా వసూలు చేసింది సాహో. ఇదిలా ఉంటే సాహో తర్వాత సుజీత్ ఏం సినిమా చేయబోతున్నాడు.. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. ఎవరితో చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరమే. ఎందుకంటే అన్ని భారీ సినిమా తర్వాత ఈ కుర్రాడి అడుగులు ఎక్కడ పడతాయనేది అంతా ఆసక్తిగా చూస్తున్న అంశం. దీనికి ఆయన కూడా ఆసక్తికరమైన సమాధానమే ఇచ్చాడు.

Saaho director Sujeeth following SS Rajamouli foot steps for his next movie pk అవును.. నమ్మడానికి కొత్తగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే రాజమౌళి దారిలో వెళ్తున్నాడు సుజీత్. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సుజీత్. సాహో సినిమాతో ఈయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. saaho,saaho movie,saaho movie collections,sujeeth,sujeeth sign,sujeeth movies,sujeeth saaho,sujeeth saaho movie,sujeeth next movie,sujeeth rajamouli,telugu cinema,సుజీత్,సుజీత్ సైన్,సుజీత్ నెక్ట్స్ మూవీ,సుజీత్ రాజమౌళి,తెలుగు సినిమా
సుజీత్ సాహో టీం (Source: Twitter)


ఈయన చిన్న సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఒకప్పుడు మగధీర లాంటి భారీ సినిమా తర్వాత చాలా తెలివిగా ఎలాగైతే రాజమౌళి మర్యాద రామన్న సినిమా చేసాడో.. సుజీత్ కూడా ఇప్పుడు ఇదే దారిలో వెళ్తున్నాడు. అయితే స్క్రిప్ట్ ప్రస్తుతానికి సిద్ధం కాలేదని.. త్వరలోనే అన్ని వివరాలు చెప్తానంటున్నాడు ఈయన. ప్రస్తుతానికి ఏం చెప్పడం లేదు ఈ దర్శకుడు. మరి ఈయన తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
First published: October 23, 2019, 10:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading