‘సాహో’ సినిమాపై వస్తున్న వదంతలును నమ్మోద్దంటున్న దర్శకుడు సుజిత్..

సామో డైరెక్టర్ సుజిత్, ప్రభాస్

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ  చిత్రంపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో సల్మాన్ నటించడంపై దర్శకుడు సుజిత్ క్లారిటీ ఇచ్చాడు.

  • Share this:
    బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ  చిత్రంపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను ఈ యేడాది ఆగష్టు 15 కానుకగా విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావొస్తోన్న ఈ చిత్రంపై పూటకో గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. దీనిపై ఈ  చిత్ర దర్శకుడు సుజిత్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వెలుబడుతున్నాయి. అందులో ఏ మాత్రం నిజం లేదని దర్శకుడు సుజిత్..తాజాగా ఒక మీడియా సమావేశంలో ‘సాహో’ సినిమాపై వస్తున్న వదంతులను కొట్టిపారేసాడు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరోవైపు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ చివరి షెడ్యూల్ ముంబాయిలో జరుగుతోంది. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.
    First published: