Sujeeth : పెళ్లి చేసుకున్న ప్రభాస్ దర్శకుడు సుజీత్.. పిక్స్ వైరల్..

ప్రవళిక రెడ్డితో సుజీత్ Photo : Twitter

Sujeeth : సాహోతో దేశవ్యాప్తంగా పాపులర్ అయినా యంగ్ డైరెక్టర్ సుజీత్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    సాహోతో దేశవ్యాప్తంగా పాపులర్ అయినా యంగ్ డైరెక్టర్ సుజీత్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తన గర్ల్ ఫ్రెండ్ ప్రవల్లిక రెడ్డితో ఇటీవలే నిశ్చితార్ధం చేసుకున్నారు. అయితే నిశ్చితార్థం సందర్భంగా ఆగస్టులో వివాహం జరుగుతుందని వెల్లడించారు కుటుంబ సభ్యులు. అందులో భాగంగా సుజీత్ నిన్న హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో డాక్టర్ ప్రవల్లిక ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సుజీత్, ప్రవల్లిక పెళ్లికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏమంటే సుజీత్ తన పెళ్లికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవితో ఓ సినిమాను చేయనున్నాడు సుజీత్. మలయాళంలో సూపర్ హిట్టైనా లూసీఫర్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాతో పాటు సుజీత్.. గోపీచంద్ హీరోగా యువి క్రియేషన్స్‌తో ఒక ప్రాజెక్ట్‌లో సంతకం చేసినట్లు వార్తకు వస్తున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published: