Saaho : రూ.200 టిక్కెట్ రూ.2వేలకు.. ఫ్యాన్స్‌ను దోచేస్తున్నారు..

Saaho Tickets : టిక్కెట్ విక్రయాలపై పోలీసులు థియేటర్ యాజమన్యాలకు ఇప్పటికే లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని.. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు,కటౌట్లు ఏర్పాటు చేయవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు.

news18-telugu
Updated: August 30, 2019, 7:23 AM IST
Saaho : రూ.200 టిక్కెట్ రూ.2వేలకు.. ఫ్యాన్స్‌ను దోచేస్తున్నారు..
రెబల్ స్టార్ ప్రభాస్ (Source: Twitter)
news18-telugu
Updated: August 30, 2019, 7:23 AM IST
బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా కోసం తెల్లవారుజాము నుంచే థియేటర్ల దగ్గర అభిమానుల హడావుడి మొదలైంది. రూ.350కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించడం.. ప్రభాస్ నేషనల్ స్టార్‌గా నిలబడటానికి దోహదం చేసే సినిమా కావడంతో.. సాహోను మొదటిరోజు మొదటి ఆటకే చూసేయాలన్న ఉత్సాహం,ఆసక్తి అభిమానుల్లో రెట్టింపయ్యింది. అయితే ఇదే అదనుగా ఫ్యాన్స్‌ను దోచేసుకుంటున్నాయి కొన్ని థియేటర్ యాజమాన్యాలు. టికెట్స్‌ను బ్లాక్‌లో అమ్ముతూ వారి జేబులను గుల్ల చేస్తున్నాయి. రూ.200 టిక్కెట్‌ను రూ.2వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. టిక్కెట్ విక్రయాలపై పోలీసులు థియేటర్ యాజమన్యాలకు ఇప్పటికే లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని.. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు,కటౌట్లు ఏర్పాటు చేయవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. బ్లాక్ టిక్కెట్ విక్రయాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ.. కొన్ని థియేటర్ యాజమన్యాలు మాత్రం దాన్ని లెక్క చేయడం లేదు.

కాగా, హైకోర్టులో రిట్ దాఖలు చేసిన మేరకు టిక్కెట్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. సినిమా అదనపు ప్రదర్శనలకు ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. అర్థరాత్రి ఒంటి గంట నుంచి మరుసటిరోజు ఉదయం 10గంటల వరకు ఎక్స్‌ట్రా షోలు వేసుకోవచ్చని అనుమతినిచ్చింది. దీంతో చాలా థియేటర్స్ బెనిఫిట్ షోలు సహా అదనపు షోలను ప్లాన్ చేసుకున్నాయి. మొత్తం మీద ఈ శుక్రవారం రాష్ట్రంలో సాహో సందడి స్పష్టంగా కనిపిస్తోంది. బాహుబలితో ప్రేక్షకులను మెప్పించిన ప్రభాస్.. మరి సాహోతో మెప్పించాడా? లేదా..? అన్నది ఇంకా కొన్ని గంటల్లో తేలిపోనుంది.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...