ఏంటి ప్రభాస్ హీరోయిన్‌కు అభిమానులు చుక్కలు చూపించారా.. ఇంతకీ శ్రద్ధాకపూర్ విషయంలోనే ఇది జరిగిందా అనుకుంటున్నారా..? సాహో వరకు నిజమే కానీ హీరోయిన్ అంటే శ్రద్ధా కపూర్ మాత్రం కాదు. సాహో హీరోయిన్ అంటే ఇక్కడ ఎవిలిన్ శర్మ. ఈ భామతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ పరిచయం కావడానికి ఎన్నో రోజులు పట్టేలా లేదు. ఎందుకంటే ప్రభాస్ సాహో సినిమాలో ఈమె కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పుడు ఈమెకు అభిమానుల నుంచి అనుకోని చేదు సంఘటన ఎదురైంది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడే అందరికీ ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేశారు. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా తన హోటల్ రూమ్ కి వెళ్తుంటే.. ఒకరు అనుమానాస్పదంగా ఎవిలన్ శర్మకు కనిపించారు. ఆవిడ వెంటే ఫాలో అవుతూ హోటల్ వరకు వచ్చేశాడు ఆ సదరు వ్యక్తి. దాంతో ఆమె భయపడిపోయి అక్కడే ఉన్న సెక్యూరిటీకి విషయం చెప్పింది. నిజానికి అతను ఎవరో తనకు కూడా తెలియదని.. అలా వెంట పడుతూ వస్తుంటే భయమేసిందని చెబుతుంది శర్మ. కానీ సెక్యూరిటీ పట్టుకున్న తర్వాత అసలు విషయం ఆ కుర్రాడు.
అది తెలిసిన తర్వాత షాక్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ కుర్రాడు ఎవిలిన్ శర్మకు పెద్ద అభిమాని. దాంతో అభిమాన హీరోయిన్ ను చూడటానికి ఆమె వెంట వచ్చాడు.. హోటల్ రూమ్ వరకు రావడంతో ఆమె భయపడింది. అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇలాంటి పనులు చేయద్దని పంపించింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది ఎవిలిన్ శర్మ. ఇప్పుడు సాహో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి. ఏదేమైనా అభిమాని చేసిన పనికి ఎవిలిన్ శర్మకు చెమటలు పట్టాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Shraddha Kapoor, Telugu Cinema, Tollywood