SP Balasubrahmanyam : దివంగత ఎస్పీ బాలు ఆస్తులను ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఒక్కొక్కటిగా అమ్మకానికి పెట్టారంటూ ఓ వార్త కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. గతేడాది కరోనా కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయిన ఎస్పీ బాలు.. ఆ తర్వాత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎస్పీ బాలు కన్నుమూసి యేడాది పూర్తి కావొస్తోన్న పాటల రూపంలో ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నారనే అనుకుంటున్నారు ఆయన అభిమానులు. ఆ సంగతి పక్కన పెడితే.. ఎస్పీ బాలు కన్నుమూసిన తర్వాత ఆయన సంబంధించిన ఒక్కొక్క ఆస్తిని ఆయన తనయుడు చరణ్ అమ్మివేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గతంలో ఎస్పీ బాలు తనయుడు చరణ్.. కొన్ని సినిమాలను నిర్మించి నష్టపోయారు. ఆ అప్పులను తీర్చడానికి ఇపుడు తన తండ్రి బాలు సమకూర్చిన ఆస్తులను ఒక్కొక్కటిగా చరణ్ అమ్మివేస్తున్నట్టు ఈ వార్తల సారాంశం. తన తండ్రి సమకూర్చిన ఆస్తులను అమ్మివేస్తున్న వస్తున్న వార్తలపై ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి ఎస్పీ బాలు ఆస్తులను అమ్మివేస్తున్నట్టు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదున్నారు. నా సినిమాలు, దాని ద్వారా ఏర్పడిన నష్టాలు.. ఆ కారణంగా ఏర్పడిన అప్పులను తీర్చడానికి నేను ఎపుడు నాన్నగారి ఇమేజ్ను వాడుకోలేదు. సినిమాలు నిర్మించడం వల్ల వచ్చిన నష్టాన్ని ఎపుడు నాన్నపై భారం మోపలేదు.
నా అప్పులను తీర్చుకోవడానికి నేను వేరే ఇతర మార్గాలను ఎన్నుకున్నాను. ఐతే.. ఎస్పీ బాలు ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారంటూ వస్తున్న వార్తల వెనక పెద్ద రీజనే ఉంది. రీసెంట్గా చెన్నైలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గురువు కోదండపాణి పేరిట ఏర్పాటు చేసిన కోదండపాణి స్టూడియోస్‌ను రీసెంట్గా ఎస్పీ చరణ్ అమ్మేసారు. బాలు గారు చనిపోయినప్పటి నుంచి కోదండపాణి స్టూడియోలో రికార్డింగ్స్ తగ్గిపోయాయట. పైగా అందులో పనిచేసే స్టాఫ్‌కు పని లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కోదండపాణి స్టూడియోను చరణ్‌కు అమ్మేసారు. ఈ నేపథ్యంలో ఎస్పీ చరణ్... తన తండ్రి ఎస్పీ బాలు ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఏమైనా ఇది ఇక్కడితో ఆగితే మంచిది అంటున్నారు బాలు అభిమానులు.
ఇవి కూడా చదవండి
అల్లు అర్జున్ కూతురు నుంచి ఎన్టీఆర్ కుమారుడు వరకు వెండితెరపై స్టార్ కిడ్స్ సందడి..
Suma Kanakala - Rajeev : వివాదంలో సుమ, రాజీవ్ కనకాల దంపతులు..
నాగార్జునకు పెద్ద తల నొప్పిగా మారిన ఎన్టీఆర్ .. మరోసారి అక్కినేని Vs నందమూరి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.