కరోనా బారిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ఆయన చెల్లెలు, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ ఊరట కలిగించే వార్త చెప్పారు. తన అన్నయ్య ఆరోగ్యం రోజురోజుకు మెరుగవుతోందని తెలిపిన శైలజ.. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయనకు స్పందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఉంచిన వెంటిలేటర్ తొలగించారని వెల్లడించారు. మిగలిన వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయిన అన్నారు. అన్నయ్య కోలుకుంటున్న తీరు పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఎస్పీ శైలజ తెలిపారు. ఆయన కోలుకోవాలని ప్రపంచమంతా కోరుకుంటోందని... త్వరలోనే ఆయన కోలుకుని వస్తారని వీడియో సందేశం ద్వారా ఎస్పీ శైలజ తెలిపారు.
ఈ నెల 5న బాలసుబ్రమణ్యంకు కరోనా సోకింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడంతో ఆయన కొద్దిరోజులు ఇంట్లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. అయితే ఆ తరువాత లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయనను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దిరోజులుగా ఐసీయూలోనే వెంటిలేటర్‌పై ఉంటూ చికిత్స పొందుతున్న బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, ఆయన సన్నిహితులు ఆకాంక్షించారు. తాజా ఆయన చెల్లెలు బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పడం ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.