SP Balasubrahmanyam Health Update: కరోనా బారిన పడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ మేరకు ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటివ్ విడుదల చేశాయి. ఈ నెల 5న బాలసుబ్రమణ్యంకు కరోనా సోకింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడంతో ఆయన కొద్దిరోజులు ఇంట్లోనే హోం ఐసొలేషన్లో ఉన్నారు. అయితే ఆ తరువాత లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇక నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయనను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పతి వర్గాలు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నాయి. పలు వైద్య బృందాలు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.
తనకు కరోనా సోకినట్లు ఇటీవల సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఎస్పీబీ...తనకు గొంతు కాస్త ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఇతర ఏ ఆరోగ్య సమస్యలు లేవని పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరినట్లు ఆ వీడియోలో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.