ఎస్. జానకి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు..

పాపులర్ ప్లేబాక్ సింగర్ ఎస్. జానకి తెలియని సంగీత ప్రియులు దాదాపు ఉండరు.

news18-telugu
Updated: June 29, 2020, 8:51 AM IST
ఎస్. జానకి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు..
సింగర్ S. జానకి Photo : Twitter
  • Share this:
పాపులర్ ప్లేబాక్ సింగర్ ఎస్. జానకి తెలియని సంగీత ప్రియులు దాదాపు ఉండరు. ఆమె ఇప్పటికి వరకు పలు భాషాల్లో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. అయితే ముఖ్యంగా ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎక్కువుగా పాటలు పాడారు. ఎస్. జానకి జాతీయ ఉత్తమ గాయనిగా నాలగు సార్లు అవార్డ్ అందుకొన్నారు. అంతేకాదు 31 సార్లు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తమ గాయని అవార్డ్‌తో సత్కరించాయి. ఇక ఆరోగ్య కారణాల దృష్ట్యా పాటలు పాడను అంటూ ఆ మధ్య ఎస్. జానకి ఓ స్టేజ్‌పై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి జానకమ్మ పాటలు పాడటం లేదు. ఆమె చివరగా 'పదు కల్పానికల్' అనే మలయాళం సినిమాలో 'అమ్మా పూవినమ్' అనే పాట పాడారు. అది అలా ఉంటే తాజాగా ఆమె ఆరోగ్యంపై కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. ఆమె మరణించిందని.. అనారోగ్య కారణంగా ఓ ఆపరేషన్ చేస్తుంటే మరణించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదంటూ కుటుంబ సభ్యులు ఆమె ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. ఆమె ఓ చిన్న ప్రాబ్లమ్ నిమిత్తం ఆపరేషన్ చేయించుకుని హాస్పటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుందని తెలిపారు. దీనికి సంబందించి ఆమె కుమారుడు క్లారిటీ ఇచ్చాడు.


‘‘చిన్న ప్రాబ్లమ్ నిమిత్తం ఎస్. జానకిగారికి మైనర్ సర్జరీ జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషయంలో బయట వినిపించే వార్తలను నమ్మవద్దు. ఆమె క్షేమంగా ఉన్నారు. దయచేసి ఇలాంటి వార్తలను పుట్టించవద్దు..’’ అని ఎస్. జానకి కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి సంబందించి నటుడు మనోబాల కూడా ఎస్. జానకి ఆరోగ్యంపై వివరణ ఇచ్చాడు. ఆమెకు ఏం కాలేదని.. చిన్న సర్జరీ జరిగిందని తెలిపాడు.
First published: June 29, 2020, 7:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading