ప్రస్తుతం హీరో నాని ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమాలో నటిస్తున్నాడు న్యాచురల్ స్టార్.ఈ సినిమాలో నాని అర్జున్ అనే రంజీ క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. 1990 నేపథ్యంలో ఈ సినిమా సాగుతోంది.
ఈ సినిమాతో పాటు నాని..విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమాకు ఈ రోజే కొబ్బరికాయ కొట్టాడు. రేపటి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నాని సరసన ఐదుగురు కథానాయికలు నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను హాలివుడ్లో వచ్చిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్ బటన్’ అనే సినిమా స్పూర్తితో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. అందులో ఒకటి యంగ్ క్యారెక్టర్, మరోకొటి మిడిల్ ఏజ్ లుక్, చివరది ముసలోడి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో విలన్గా RX100 ఫేమ్ కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని కార్తికేయ..నానితో దిగిన ఫోటోను పోస్ట్ చేసి మరి కన్ఫామ్ చేసాడు.
ఈ సినిమాలో విలన్గా కార్తికేయ పాత్రకు మంచి స్కోప్ ఉందని చెబుతున్నారు. మొత్తానికి RX 100తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ దక్కించుకున్న కార్తికేయ..ఈ సినిమాలో తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ఇచ్చాడు. మొత్తానికి RX 100 హీరోగా రచ్చ చేసిన కార్తికేయ ఇపుడు విలన్గా ఏ రకంగా మెప్పిస్తాడో చూడాలి.
TSR Awards Function: ఒకే వేదికపై మెరిసిన అగ్ర నటులు
ఇవి కూడా చదవండి
ఆ ఘటన వల్ల చాలా సినిమాలు కోల్పోయాను..నటి రమ్యకృష్ట
వైఎస్ జగన్తో జూనియర్ ఎన్టీఆర్ మామ భేటీ... వైసీపీలో చేరతారా?
చెత్తకుప్పల్లో తిరిగే శునకం.. సినిమా స్టార్ అయ్యింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Megha Akash, Nani, Priya Prakash Varrier, Rashmika mandanna, RX 100 Fame Karthikeya, Telugu Cinema, Tollywood