హీరో కార్తీకేయ 90 ఎంఎల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్...

కార్తికేయ హీరోగా నటించిన '90 ఎంఎల్‌' సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. డిసెంబర్‌ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

news18-telugu
Updated: November 10, 2019, 10:57 PM IST
హీరో కార్తీకేయ 90 ఎంఎల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్...
డిసెంబర్ 5న రిలీజ్ కానున్న 90ఎంఎల్ సినిమా
news18-telugu
Updated: November 10, 2019, 10:57 PM IST
ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన '90 ఎంఎల్‌' సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. డిసెంబర్‌ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌ సంస్థ నిర్మిస్తోంది. నేహా సోలంకి హీరోయిన్. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. 90.ఎంఎల్‌ అనే టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉండేలా చూస్తున్నారు. సినిమా మొత్తం వినోదాత్మకంగా సాగుతుందని యూనిట్ చెబుతోంది. రీసెంట్‌గా అజర్‌బైజాన్‌లో మూడు పాటలు చిత్రీకరించారు. ఆ పాటలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇటీవల సినిమాకు సంబంధించిన రెండు పాటలను రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్సాన్స్ వచ్చింది.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...