'RX100' సినిమాతో క్రేజీ హీరోగా మారాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతోనే తనలోని మెటల్‌ను బయటపెట్టాడు. ఇటు రొమాంటిక్ సీన్స్‌లో గాని లేదా అటు యాక్షన్ సీన్స్‌లలో కూడా ఇరగదీశాడు. 'RX100' సినిమా తర్వాత 'హిప్పీ' అనే సినిమాతో వచ్చిన కార్తికేయ ఆ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత 'గుణ 369' అంటూ వచ్చి పరవాలేదనిపించాడు. అది అలా ఉంటే తాజాగా కార్తికేయ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఆ సినిమా పేరు కూడా క్రేజీగానే ఉంది. అదే ‘90ml’. మామూలుగా '90ml' అంటే టక్కున గుర్తొచ్చేది మందు. అంతేకాదు మందు బాబులకు '90ml' అంటే ఎంటో ఊరికే చెప్పేస్తారు.. అదో కొలమానం. మాస్‌లో చాలా పాపులర్ ఆ పదం. ఇంత ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఇప్పుడు కార్తికేయ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైయాడు. ఈ సినిమాను ‘RX100’ చిత్రాన్ని నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. కాగా దర్శకుడిగా శేఖర్ రెడ్డి పరిచయం అవుతున్నారు. హీరోయిన్‌గా నేహా సోలంకి చేస్తోంది.
ఈ సినిమా నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ '90ml’ సినిమా.. 70 శాతం షూటింగ్ పూర్తయిందని.. దర్శకుడు శేఖర్ రెడ్డి కొత్తవాడైనా సినిమాను బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్నాడన్నారు. గత చిత్రం 'RX100’ మాదిరిగానే ఈ సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉండి.. ప్రేక్షకుల్నీ కట్టిపడేస్తుందని ధీమా వ్వక్తం చేశారు. కాగా కార్తికేయ నాని ప్రధాన పాత్రలో వస్తున్న 'గ్యాంగ్ లీడర్' అనే సినిమాలో విలన్‌గా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.