Ajay Bhupathi : ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతికి కరోనా పాజిటివ్..

Ajay Bhupathi : ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతికి ఈ మహమ్మారి సోకింది.

news18-telugu
Updated: August 13, 2020, 11:53 AM IST
Ajay Bhupathi : ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతికి కరోనా పాజిటివ్..
అజయ్ భూపతి Photo : Twitter
  • Share this:
మహమ్మారి కరోనా తెలుగు రాష్ట్రాల్లో కరాళ నృత్యం చేస్తోంది. ఏరోజుకారోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్‌ మరింతగా విజృంభిస్తోంది. దీంతో ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతికి ఈ మహమ్మారి సోకింది. ఈ విషయాన్ని డైరెక్టర్ అజయ్ భూపతే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన రాస్తూ.. 'నాకు కూడా వచ్చేసింది… త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా' అంటూ ట్వీటాడు. దీంతో ఆయన నెటిజన్స్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ వైరస్ బారిన ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, డైరక్టర్ తేజ కరోనా బారినపడ్డారు. కాగా.. రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. మరో ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పాప్ సింగర్ స్మిత కూడా కరోనా బారిన పడినట్టుగా వెల్లడించిన సంగతి తెలిసిందే.





ఇక డైరెక్టర్ అజయ భూపతి సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై చిన్న సినిమాతో వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన అజయ్.. ప్రస్తుతం మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తుండగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: August 13, 2020, 11:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading