బాలయ్య నిర్మాతతో RX 100 దర్శకుడి చిత్రం.. ఇంతకీ హీరో ఎవరంటే..

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా అజయ్ భూపతి తెరకెక్కించిన ‘RX100’ సినిమా తెలుగులో కొత్త ఒరవడి సృష్టించింది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా అజయ్ భూపతికి డిమాండ్ పెరిగింది. అజయ్ భూపతి రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే మూడో ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయింది.

news18-telugu
Updated: September 13, 2019, 9:28 AM IST
బాలయ్య నిర్మాతతో RX 100 దర్శకుడి చిత్రం.. ఇంతకీ హీరో ఎవరంటే..
బాలకృష్ణ,అజయ్ భూపతి,భవ్య అధినేత ఆనంద్ ప్రసాద్ (twitter/Photo)
  • Share this:
కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా అజయ్ భూపతి తెరకెక్కించిన ‘RX100’ సినిమా తెలుగులో కొత్త ఒరవడి సృష్టించింది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా అజయ్ భూపతికి డిమాండ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి.. ‘మహా సముద్రం’ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాలో రవితేజను హీరోగా అనుకున్నారు. కానీ ఇంత వరకు ఎవరు సెట్ కాలేదు. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించే అవకాశాలున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అజయ్ భూపతి రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే మూడో ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. ఈ సినిమాను బాలకృష్ణతో ‘పైసా వసూల్’సినిమాను నిర్మించిన భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించాడు.ఈ సినిమాలో సెన్సేషనల్ స్టార్ హీరో నటించబోతున్నట్టు హింట్ ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం  ప్రకారం ఈ సినిమాలో ఇస్మార్ట్ హీరో రామ్ హీరోగా నటించడం దాదాపు ఖరారైంది.
రామ్‌తో అజయ్ భూపతి సినిమా (Twitter/Photo)


త్వరలోనే ఈ విషయమై అపీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. మరి RX 100 లాగే తెలుగులో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading