పాయల్ రాజ్‌పుత్‌లో ఈ కళ కూడా ఉందా.. లాక్‌డౌన్‌లో ఇంతపని చేస్తుందనుకోలేదు..

Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా ఈ భామ.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.

news18-telugu
Updated: May 17, 2020, 3:44 PM IST
పాయల్ రాజ్‌పుత్‌లో ఈ కళ కూడా ఉందా.. లాక్‌డౌన్‌లో ఇంతపని చేస్తుందనుకోలేదు..
పాయల్ రాజ్‌పుత్ (payal rajput )
  • Share this:
Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. పోయినేడాది చివర్లో వెంకీ మామతో పలకరించిన పాయల్.. ఈ యేడాది ‘డిస్కోరాజా’ సినిమాతో పలకరించింది. తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉంటుంది. అంతెేకాదు ఇంట్లో తనకు సంబంధించిన పనులను కూడా తానే చేసుకుంటుంది. తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఓ షార్ట్ ఫిల్మ్ తీసింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ను పాయల్ కేవలం ఒక రోజు వ్యవధిలోనే పూర్తి చేసిందట. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఈ షార్ట్ ఫిల్మ్‌లో పాయల్ రాజ్‌పుత్ ‘ప్రియా’ అనే రైటర్‌గా కనిపిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో తాగుడుకు బానిసైన భర్త ప్రతి రోజు ఆమెను ఇబ్బందుల పాలు చేస్తుంటాడు. భర్త హింస రోజు రోజుకు పెరిగిపోవడంతో ఆమె తన పనిపై దృష్టి సారించలేకపోతుంది. దీంతో  విసుగొచ్చిన ఆమె తన భర్తను కత్తితో పొడిచి చంపేస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ వీడియోను  పాయల్ రాజ్‌పుత్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు హిందీ సీరియల్స్‌తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన  పాయల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత తెలుగులో తన లక్‌ను పరీక్షించుకుంది. త్వరలో ఏంజెల్ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
First published: May 17, 2020, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading