Nagarjuna | అక్కినేని నాగార్జునకు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు.. ?

Nagarjuna Akkineni | టాలీవుడ్ సీనియర్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: August 25, 2019, 12:52 PM IST
Nagarjuna | అక్కినేని నాగార్జునకు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు.. ?
అక్కినేని నాగార్జున (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 25, 2019, 12:52 PM IST
టాలీవుడ్ సీనియర్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈ గురువారం షష్టీ పూర్తి మహోత్సవం జరుపుకోబోతున్నారు సినీ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసు మీద పడుతున్న ఇప్పటికీ నవ మన్మథుడిలా తన ఇద్దరు కొడుకులతో పోటీ పడుతూ నటిస్తున్నాడు. రీసెంట్‌గా ‘మన్మథుడు2’ సినిమాతో పలకిరించిన నాగ్.. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ గురువారం నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకల ఏర్పాట్ట గురించి చర్చించేందకు అభిమానులు ఆయన ఇంటికి వెళ్లగా.. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి వారితో ఎలాంటి చర్చలు జరపలేదని నాగార్జున సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ శనివారం జరిగిన బిగ్‌బాస్ 3 ఎపిసోడ్‌లో నాగార్జున ఎంతో యాక్టివ్‌గా కనిపించడంతో ఆయన అస్వస్థతకు గురైన వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది నిర్ధారించాల్సి ఉంది. లేకపోతే వరుస షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా గడపడంతో నాగార్జున ఏమైనా అలసటకు గురి కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా ఈ విషయమై నాగార్జున క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...