Uppena Climax: ఉప్పెన మూవీ క్లైమాక్స్ పై పుకార్లు.. వీటిలో ఏది నిజం

ఉప్పెన

Uppena Climax: తెలుగులో ఈ నెల‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కాబోతున్న చిత్రాల్లో ఉప్పెన ఒక‌టి. వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతోన్న ఈ మూవీకి లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌డికి కూడా ఈ మూవీ మొద‌టిది కావ‌డం విశేషం

  • Share this:
    Uppena Climax: తెలుగులో ఈ నెల‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కాబోతున్న చిత్రాల్లో ఉప్పెన ఒక‌టి. వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతోన్న ఈ మూవీకి లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌డికి కూడా ఈ మూవీ మొద‌టిది కావ‌డం విశేషం. ఇక ఈ ముగ్గురు కొత్త వాళ్లే అయిన‌ప్ప‌టికీ.. ఉప్పెన‌పై మొద‌టి నుంచి మంచి అంచ‌నాలు ఉన్నాయి. వాటికి కార‌ణం ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించ‌డం.. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించ‌డం, రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌డం. వీట‌న్నింటికి తోడు ఈ మూవీ నుంచి వ‌చ్చిన పోస్ట‌ర్‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్, పాట‌లు అంద‌రినీ బాగా ఆక‌ట్టుకోవ‌డం. మ‌రోవైపు ఈ మూవీ క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో థియేట‌ర్లు తెరిచే వ‌ర‌కు దర్శ‌క‌నిర్మాతలు ఎదురుచూడ‌టం. దీంతో ఉప్పెన‌పై ఇప్పుడు అభిమానుల్లో చాలా అంచ‌నాలు ఉన్నాయి.

    కాగా ఫిబ్ర‌వ‌రి 12న ఈ మూవీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఈ క్ర‌మంలో ఉప్పెన క్లైమాక్స్‌పై సోష‌ల్ మీడియాలో ప‌లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో చిరంజీవి మాట్లాడుతూ క్లైమాక్స్‌ని ద‌ర్శ‌కుడు చాలా క‌న్విన్సింగ్‌గా చెప్పాడ‌ని అన్నారు. వాటికి తోడు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న క్లైమాక్స్‌ని చూసి అరే.. అయ్యో అని ప్రేక్ష‌కులు అనుకుంటార‌ని తెలిపారు. దీంతో ఉప్పెన క్లైమాక్స్ విషాదాంతంగా ఉండ‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

    ఈ నేప‌థ్యంలో ఈ సినిమా క్లైమాక్స్‌లో విజ‌య్ సేతుప‌తి మ‌నుషులు హీరో చేయిని న‌రికేస్తార‌ని, ట్రైల‌ర్‌లో అలాంటి సీన్‌ని చూపించార‌ని కొంద‌రు అంటుండ‌గా.. మ‌రికొంద‌రు చివ‌ర్లో హీరోయిన్‌, హీరోను చంపేస్తుంద‌ని వారి ఒపీనియ్‌ని చెబుతున్నారు. ఇంకొంద‌రేమో వైష్ణ‌వ్ తేజ్‌ని న‌పుంశ‌కుడిని చేస్తార‌ని అంచ‌నాలు వేస్తున్నారు. మ‌రి వీటిలో నిజ‌మెంత‌..? అస‌లు ఉప్పెన క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతోంది..? ఎన్నో అంచ‌నాల మ‌ధ్య‌న వ‌స్తోన్న ఉప్పెన ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుంటుంది..? తెలియాలంటే మ‌రో మూడు రోజులు ఆగాల్సిందే.
    Published by:Manjula S
    First published: