హోమ్ /వార్తలు /సినిమా /

రూలర్ టైటిల్ బాలయ్యది కాదా? గిఫ్ట్ ఇచ్చిన అభిమాని...

రూలర్ టైటిల్ బాలయ్యది కాదా? గిఫ్ట్ ఇచ్చిన అభిమాని...

రూలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ కొత్త విషయాన్ని బయటపెట్టాడు.

    నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న రూలర్ సినిమా ఈ నెల 20న రిలీజ్‌కు సిద్ధమైంది. బాలయ్య డిఫరెంట్ లుక్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలయ్య సినిమా అంటే ఉండాల్సిన మాస్ లుక్, యాక్షన్, డ్యాన్స్ వంటి అంశాలు కూడా పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ట్రైలర్‌లో కొన్ని పొలిటికల్ పంచ్‌లు కూడా ఉన్నాయి. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా భూమిక, జయసుధ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా వస్తోంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేషన్స్ బ్యానర్ మీద కేఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విశాఖలో జరిగిన రూలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయింది. రూలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ కొత్త విషయాన్ని బయటపెట్టాడు. అసలు రూలర్ సినిమా అనేది తాను రిజిస్టర్ చేయించిన టైటిల్ అని చెప్పాడు. అందుకోసం ఓ పాట కూడా రికార్డింగ్ చేయించానన్నాడు. అయితే, అది చివరకు బాలకృష్ణ దగ్గరకే వచ్చిందన్నాడు. ఈ టైటిల్‌ బాలకృష్ణకు మాత్రమే కరెక్ట్‌గా సెట్ అవుతుందని బోయపాటి చెప్పాడు.

    First published:

    Tags: Bala Krishna Nandamuri, Boyapati Srinu, Ruler, Tollywood Movie News

    ఉత్తమ కథలు