హోమ్ /వార్తలు /సినిమా /

HER Teaser: నాని చేతుల మీదుగా HER టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రుహాణి విజువల్స్

HER Teaser: నాని చేతుల మీదుగా HER టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రుహాణి విజువల్స్

Ruhani Sharma Her Teaser by nani (Photo Twitter)

Ruhani Sharma Her Teaser by nani (Photo Twitter)

Ruhani Sharma: HIT సినిమాలో తన టాలెంట్ బయటపెట్టి సక్సెస్ అందుకున్న రుహాణి.. అదే బాటలో ఇప్పుడు HER అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

చిలసౌ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి కెరీర్ పరంగా విలక్షణ కథలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది హీరోయిన్ రుహాణి శర్మ (Ruhani Sharma). HIT సినిమాలో తన టాలెంట్ బయటపెట్టి సక్సెస్ అందుకున్న రుహాణి.. అదే బాటలో ఇప్పుడు HER అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకున్న ఈ హీరోయిన్, తొలిసారి ఫిమేల్ లీడ్ చేస్తూ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. HER అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తనలోని మరో యాంగిల్ చూపించేందుకు రెడీ అయింది. తాజాగా ఈ సినిమా టీజర్ (HER Teaser) ను నాచురల్ స్టార్ నాని (Nani) చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ వదిలిన అనంతరం చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు నాని.

ఈ టీజర్ లో రుహాణి శర్మ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆమె ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని వీడియో లోని సన్నివేశాలు ప్రూవ్ చేశాయి. డ్యూటీ పరంగా 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఓ హత్య కేసును ఛేదించడానికి తిరిగి ఖాకీ డ్రెస్ ధరించిన రుహాణి శర్మ సీన్ తో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీధర్ స్వరగావ్ రూపుదిద్దిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపయ్యాయి.' isDesktop="true" id="1585398" youtubeid="XsmW6uwMWRc" category="movies">

డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఇతర అప్ డేట్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయగా.. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాలోని వైవిధ్యాన్ని తెలుపుతూ హైప్ తీసుకొచ్చింది. HER Chapter 1 అనే టైటిల్ తో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

First published:

Tags: Hero nani, Ruhani Sharma, Tollywood actress

ఉత్తమ కథలు