హోమ్ /వార్తలు /సినిమా /

HER First look: రుహాణి శర్మ ప్రధాన పాత్రలో HER: ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

HER First look: రుహాణి శర్మ ప్రధాన పాత్రలో HER: ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Her First look (Photo News 18)

Her First look (Photo News 18)

Ruhani Sharma: చిలసౌ ఫేమ్ రుహాణి శర్మ ప్రధాన పాత్రలో HER అనే పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ట్రెండ్ మారుతోంది. సినిమాల్లో వినూత్నం కోరుకుంటున్నారు ఆడియన్స్. రెగ్యులర్ కథలకు బిన్నంగా ఉండే సినిమాపై మక్కువ చూపుతున్నారు. వైవిధ్య భరితమైన కథలతో, సహజత్వానికి దగ్గరగా తెరకెక్కే చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ సినిమాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తోంది. అందునా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై క్రేజ్ రెట్టింపవుతూ వస్తోంది. ఇదే బాటలో తాజాగా చిలసౌ ఫేమ్ రుహాణి శర్మ (Ruhani Sharma) ప్రధాన పాత్రలో HER అనే పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ చిత్రానికి శ్రీధర్ స్వరగావ్ రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న రుహాణి శర్మను హైలైట్ చేశారు.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. రుహాణి శర్మ క్యారెక్టర్ లో కంటతడి కనిపిస్తుండటం, ఆ వెనకాల హై వే, సిటీ పరిసరాలు సినిమాలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. పోస్టర్ పై HER Chapter 1 అనే టైటిల్ వేయడం చూస్తుంటే ఈ సినిమాకు కొనసాగింపు కూడా ఉంటుందని అర్థమవుతోంది.

ఈ సినిమాకు విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. డబుల్ అప్ మీడియాస్ బ్యానర్ పై రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అదే రోజున చిత్ర విడుదల తేదీ, ఇతర అన్ని వివరాలు ప్రకటించనున్నారని సమాచారం.

First published:

Tags: Ruhani Sharma, Tolllywood, Tollywood actress

ఉత్తమ కథలు