హోమ్ /వార్తలు /సినిమా /

Shreeram Nimmala : వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీరామ్ నిమ్మల..

Shreeram Nimmala : వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీరామ్ నిమ్మల..

Shreeram Nimmala

Shreeram Nimmala

Shreeram Nimmala : రుద్రవీణ చిత్రం శ్రీరామ్ నిమ్మల కి మంచి మాస్ హీరో గా  పేరు తెచ్చిపెట్టింది. చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది హీరో బాగా చేశాడు అనే ఆడియన్స్ కొనియాడారు. రుద్రవీణ చిత్రం (Rudraveena Movie) తో శ్రీరామ్ నిమ్మల తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడు అయ్యాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలుగు చలన పరిశ్రమకి ఎందరో వస్తుంటారు కానీ కొందరినే విజయం వరిస్తుంది. అలాంటి విజయమే ఇప్పుడు శ్రీరామ్ నిమ్మల (Shreeram Nimmala) ని వరించింది. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీరామ్ నిమ్మల కి సినిమా అంటే పిచ్చి. రెబెల్ స్టార్ ప్రభాస్ కి వీరాభిమాని, తన సినిమాలు చూసి సినిమా మీద పిచ్చి ప్రేమతో ఇండస్ట్రీ కి వచ్చాడు కానీ ఎన్నో ఇబ్బందులు. ఎన్నో ప్రయత్నాలు చేయగా 2020 లో 'ఉత్తర' చిత్రంలో హీరో గా అవకాశం వచ్చింది. సినిమా విడుదలై శ్రీరామ్ నిమ్మల కి మంచి పేరు తెచ్చి పెట్టింది. తర్వాత 2022 లో శ్రీరామ్ నిమ్మల హీరో గా నటించిన సాఫ్టువేర్ బ్లూస్ (Software Blues) మరియు రుద్రవీణ (Rudraveena Movie) చిత్రాలు విడుదల అయ్యాయి. రుద్రవీణ చిత్రం శ్రీరామ్ నిమ్మల కి మంచి మాస్ హీరో గా  పేరు తెచ్చిపెట్టింది. చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది హీరో బాగా చేశాడు అనే ఆడియన్స్ కొనియాడారు. రుద్రవీణ చిత్రం (Rudraveena Movie) తో శ్రీరామ్ నిమ్మల తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడు అయ్యాడు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా రుద్రవీణ సినిమా బాగుంది బాగా నటించావు అని కొనియాడారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది అలాగే నిర్మాతకి మంచి లాభాలు వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయి. 2022 సంవత్సరం వరుసగా 3 చిత్రాలు విడుదల అవుతున్నాయి.

సాఫ్ట్ వేర్ బ్లూస్ మరియు రుద్రవీణ విడుదల అయ్యాయి. ఇప్పుడు  'మది' అనే చిత్రం నవంబర్ 11న విడుదల కు సిద్ధం గా ఉంది. మూడు విభిన్న చిత్రాలు, మూడు విభిన్న పత్రాలు. సాఫ్ట్ వేర్ బ్లూస్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, రుద్రవీణ లో ఒక కమర్షియల్ ఒరా మాస్ పాత్ర చేశాడు. ఇప్పుడు మది చిత్రం లో టీనేజ్ కుర్రాడు నుంచి పరిపక్వత చెందిన ఒక బలమైన పాత్ర చేస్తున్నాడు.

ప్రస్తుతానికి 'తురుమ్ ఖానులు' అనే సినిమాలో ఒక పల్లెటూరి లో జరిగే మాస్ కామెడీ ఎంటర్టైనర్. ఈ చిత్రం త్వరలో ఓ టి టి లో విడుదల అవుతుంది. 'మది' అనే చిత్రం నవంబర్ 11న విడుదల కు సిద్ధం గా ఉంది.  మరొక చిత్రం "అనుకున్నవన్నీ జరగవు కొన్ని"  పోస్ట్ ప్రొడక్షన్ పన్ను లో ఉంది. ఈ చిత్రాన్ని బారి ప్రమోషన్ తో త్వరలో విడుదల చేస్తారు.

First published:

Tags: Tollywood news

ఉత్తమ కథలు