Rudrangi : ఎం.ఎల్.ఏ, రసమయి బాలకిషన్ (Rasamai Balakishan), రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'(Rudrangi). రాజన్న(Rajanna), బాహుబలి (Bahbubali), బాహుబలి2 (Bahubali 2), ఆర్. ఆర్.ఆర్ (RRR), అఖండ.(Akhanda) చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు, మమతా మోహన్ దాస్ లుక్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా 'రుద్రంగి' సినిమా నుంచి ఆశిష్ గాంధీ నటిస్తున్న మల్లేశ్ పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. డబుల్ బ్యారెల్ గన్ తో ఫెరోషియస్ గా ఉన్న ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో 'రుద్రంగి' చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులతో తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే 'రుద్రంగి' సినిమా నుంచి మమతా మోహన్ దాస్ (Mamta Mohandas) నటిస్తున్న జ్వాలాబాయి దొరసాని (Jwala Bhai Dorasani) పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. భయమెరుగని ధీరవనిత పాత్రలో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మోషన్ పోస్టర్ లో జ్వాలాబాయి దొరసాని పాత్రలో మమతా మోహన్ దాస్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
నువ్వు దొర అయితే నేను దొరసానిని తగలబెడతా, ఛల్ హట్ అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ మాస్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ మోషన్ పోస్టర్ కు చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఏఐఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో త్వరగా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood