#RRR కోసం రాజమౌళి నెక్ట్స్ ప్లాన్ ఇదేనా.. ఈ సారి మాత్రం ఆగేది లేదంటున్న జక్కన్న..

#RRR | RRR సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి కనిపిస్తుంది. దానికితోడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలను కలిపి చేస్తున్న మల్టీస్టారర్ కావడం కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం జక్కన్న పెద్ద ప్లానే వేసాడు.

news18-telugu
Updated: August 1, 2019, 7:39 PM IST
#RRR కోసం రాజమౌళి నెక్ట్స్ ప్లాన్ ఇదేనా.. ఈ సారి మాత్రం ఆగేది లేదంటున్న జక్కన్న..
RRR సినిమా ప్రెస్ మీట్
news18-telugu
Updated: August 1, 2019, 7:39 PM IST
RRR సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి కనిపిస్తుంది. దానికితోడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలను కలిపి చేస్తున్న మల్టీస్టారర్ కావడం కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని 2020, జులై 30న విడుదల చేస్తామని ప్రకటించాడు కూడా. ఇప్పటికే తారక్, చరణ్‌లకు గాయాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అంతేకాదు ఈ షూటింగ్‌లో ఒక  బ్రిడ్జ్ సెట్ కూడా హైదరాబాద్ శివారులో వేసారు. అక్కడ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

Exactly 1 Year to go for RRR movie release and Ram Charan Jr NTR fans are eagerly waiting pk RRR సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి కనిపిస్తుంది. #1YearToGoRRRRelease,rrr movie,rrr movie release date,1 year to go for rrr movie,ram charan jr ntr,rrr shooting,rrr movie shooting,rrr rajamouli,rrr movie release july 30,rrr july 30 2020,rajamouli rrr ram charan ntr,ram charan alia bhatt,jr ntr emma roberts,rajamouli bahubali,telugu cinema,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ జులై 30 2020
RRR సినిమా రిలీజ్ డేట్ (Source: Twitter)


ఆ తర్వాత RRR టీమ్ నెక్ట్స్ షెడ్యూల్‌ను దేవభూమి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్కడ హీరోలిద్దరి పరిచయ సన్నివేశాలతో పాటు సినిమాకు కీలక మలుపు తిప్పే సీన్స్‌ను తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సన్నివేశాలే ఈ సినిమాను ఇంపార్టెంట్ అని చెబుతున్నారు. 300 కోట్లతో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలియా భట్ ఇందులో రామ్ చరణ్ సరసన జోడీ కడుతుంది.ఇక హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్‌ను జూనియర్ కోసం తీసుకొస్తున్నాడు జక్కన్న. మొత్తంగా ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ వరకు కంప్లీట్ చేయాలనే కసి మీదున్నాడు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు డిసెంబర్ వరకు RRR కోసం బల్క్‌గా డేట్స్ కేటాయించారు. ఇప్పటికే ఎప్పటి కప్పడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన సన్నివేశాలను ఎడిటింగ్ చేస్తూనే వస్తున్నాడు. డిసెంబర్ తర్వాత పూర్తి స్థాయిలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కే కేటాయించనున్నాడు. మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన డిలేను ఇక ముందు జరగకుండా జాగ్రత్త పడాలనే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...