RRR Movie - KGF 2: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ వర్సెస్ కేజీఎఫ్ 2..

ఆర్ఆర్ఆర్ మూవీ వర్సెస్ కేజీఎఫ్ 2 (Twitter/Photo)

RRR Movie - KGF 2 :  గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతున్నాయి. తాజాగా కేజీఎఫ్ 2 టీజర్ విడుదలైన రోజే.. ఆర్ఆర్ఆర్ మూవీ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  RRR Movie - KGF 2 :  గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతున్నాయి. రాజమౌళి ఎపుడైతే.. ప్రభాస్‌తో ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించాడో.. అప్పటి నుంచి బాలీవుడ్‌ వాళ్లకు సౌత్ సినిమాల సత్తా ఏంటో తెలిసొచ్చింది. రాజమౌళి.. బాహుబలి  సిరీస్‌తో మొత్తం ఇండియన్ సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్.. నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక జక్కన్న కూడా బాహుబలి చిత్రానికి  అన్ని భాషల్లో ఈ రకంగా రెస్పాన్స్ వస్తుందని కూడా ఊహించలేదు. అంతేకాదు ఒక ప్రాంతీయ భాష చిత్రం హిందీలో దాదాపు రూ. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం బాలీవుడ్ మేధావులను సైతం ఆశ్యర్యపోయేలా చేసింది. బాహుబలి సక్సెస్ తర్వాత రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు అగ్ర హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ కూడా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నాడు.

  ఒక వేళ కరోనా లేకపోయి ఉంటే.. ఈ సినిమా సరిగ్గా ఈ రోజే విడుదలై ఉండేది. ముందుగా ఈ సినిమాను 2020 జూలై 31న విడుదల చేద్దామకున్నా ఈ చిత్రాన్ని 2020 జనవరి 8కి పోస్ట్ పోన్ చేసాడు రాజమౌళి. మరి ఈ రోజు అయిన రాజమౌళి .. ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ఏదైనా ప్రకటన చేస్తాడా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ దేశ వ్యాప్తంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే భీమ్ ఫర్ రామరాజు టీజర్‌తో పాటు రామ్ ఫర్ భీమరాజు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను 2021 జనవరి 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

  after declared rajamouli rrr release date pawan kalyan mahesh babu get upset here are the details,rrr,rrr release date,rrr release on january 2021,rrr twitter,rrr instagram,rrr facebook,rrr rajamouli,rrr rajamouli ram charan jr ntr,rrr pawan kalyan krish movie,rrr mahesh babu vamsi paidipally movie,rrr mahesh babu,rrr pawan kalyan,bollywood,tollywood,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్,8 జనవరి 2021 ఆర్ఆర్ఆర్ రిలీజ్,ఆర్ఆర్ఆర్ పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,ఆర్ఆర్ఆర్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అజయ్ దేవ్‌గణ్,ఆర్ఆర్ఆర్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి
  RRR రిలీజ్ డేట్ పోస్టర్ (Twitter/Photo)


  సరిగ్గా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేది ప్రకటించిన జనవరి 8న యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘కేజీఎఫ్ 2’ టీజర్‌ను విడుదల చేసారు. ఆ టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ టీజర్ విడులైన 76 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ పొందిన టీజర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు విజయ్ మాస్టర్ 78 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. మరోవైపు విజయ్ ’సర్కార్’ టీజర్ 5 గంటల్లో ఈ ఫీట్ అందుకుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ టీజర్ మాత్రం 36 గంటల 4 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ అందుకుని టాప్ 4లో నిలిచింది.

  ఆర్ఆర్ఆర్ వర్సెస్ కేజీఎఫ్ 2 (File/Photo)


  మొత్తంగా రాజమౌళి బాహుబలి వంటి సినిమాతో బాలీవుడ్ చిత్ర సీమను శాసిస్తుంటే.. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్.. యశ్ వంటి అప్ కమింగ్ హీరోతో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ సినిమా తెరకెక్కించి అద్భుతమైన విజయం సాధించాడు.అంతకు ముందు ప్రశాంత్ నీల్  ‘ఉగ్రం’ అంటూ ఒకే ఒక సినిమాను తెరకెక్కించాడు.  కేజీఎఫ్ సినిమా కూడా ఎవరు ఊహించని విధంగా కన్నడతో పాటు తెలుగు హిందీలో ఓ రేంజ్‌లో ఇరగదీసింది.

  యశ్ ‘కేజీఎఫ్ 2’ మూవీ పోస్టర్ (Twitter/Photo)


  అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్‌లోనే ఏకంగా రూ. 125 కోట్ల వరకు కొల్లగొట్టింది. తెలుగులో రూ. 3 కోట్ల లోపు బిజినెస్ చేసిన ఈ సినిమా మొత్తంగా రూ. 25 కోట్ల వరకు కొల్లగొట్టి అందరి ఆశ్యర్యపోయేలా చేసింది. అంతేకాదు కన్నడ చిత్రపరిశ్రమలో తొలి రూ.100 కోట్లు, తొలి రూ. 200 కోట్ల సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చిత్రంతో హీరోగా యశ్‌తో పాటు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ఈ రోజు యశ్ బర్త్ డే సందర్భంగా కేజీఎఫ్ 2కు సంబంధించిన టీజర్‌‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

  ఆర్ఆర్ఆర్ వర్సెస్ కేజీఎఫ్ 2 (File/Photo)


  ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూసేలా చేసాడు. రెండో పార్ట్‌లో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ నటీనటులు నటిస్తుండటం విశేషం. మరోవైపు ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో ‘సలార్’ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. మొత్తంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించిన రోజే.. యశ్ పుట్టినరోజు కావడం.. అందుకు తగ్గట్టే కేజీఎఫ్ 2 టీజర్‌తో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడాన్ని అభిమానులు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: