news18-telugu
Updated: April 21, 2020, 6:32 AM IST
రాజమౌళి Photo : Twitter
RRR : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా సీతారామరాజు గా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను ఆయన పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. దీనికి తోడు ఎన్టీఆర్ తెలంగాణా యాసలో వాయిస్ ఓవర్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు.. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉండనున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. అయితే ఎన్టీఆర్ ఎంట్రీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆయన ఎంట్రీకి సంబందించిన సీన్స్‌ను షూట్ చేయలేకపోయామని.. దీంతో ఎన్టీఆర్ ఎంట్రీ వీడియో కష్టమే అని అంటున్నాడట రాజమౌళి.
ఇక అది అలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ గురించిన మరో వార్త ఏమంటే. ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ రోల్ ఉండనుందని.. అంతేకాదు ఆయన ఎన్టీఆర్‌కు బాబాయ్‌గా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తాజాగా రాజమౌళి ఓ క్లారిటీ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్‌లో మోహన్ లాల్ నటించడంలేదని ఆయన స్పష్టం చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. తర్వాత షెడ్యూల్ పూణేలో మొదలుకానుంది.
Published by:
Suresh Rachamalla
First published:
April 21, 2020, 6:29 AM IST