Ram Charan-Alia Bhatt : ఆలియాకు రాజమౌళి బైబై.. రామ్ చరణ్‌తో‌ రొమాన్స్ చేసేది ఆమెనట..

RRR Update : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌ టైటిల్‌తో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే

news18-telugu
Updated: August 25, 2020, 1:51 PM IST
Ram Charan-Alia Bhatt : ఆలియాకు రాజమౌళి బైబై.. రామ్ చరణ్‌తో‌ రొమాన్స్ చేసేది ఆమెనట..
తారక్, చరణ్, రాజమౌళి, ఆలియా భట్ Photo : Twitter
  • Share this:
RRR Update : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌ టైటిల్‌తో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. రాజమౌళి తెలుగు టాప్ స్టార్స్ తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి ఆలియా భట్ నటించనుంది.  పూణే షెడ్యూల్‌లో ఆలియా ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ కానుందని చిత్రబృంద చెప్పుకొచ్చింది. అయితే ఏవో కారణాలతో పూణే షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. దీనికి తోడు కరోనా లాక్ డౌన్ కూడా తోడవ్వడంతో ఆలియా ఇప్పటి వరకు టీంతో జాయిన్ కాలేదు. కాగా బాలీవుడ్ బిజీ నటీమణులలో ఆలియా భట్ ఒకరు. ఆమె చేతిలో ప్రస్తుతం అదిరిపోయే ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె RRR సినిమాతో పాటు, గంగూబాయ్, సడక్ 2, బ్రహ్మస్త్రలో నటిస్తోంది. దీంతో ప్రతి ప్రాజెక్ట్‌కి పక్కా ప్లానింగ్‌తో డేట్స్ ఇచ్చిన ఆలియా భట్‌కి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టతరంగా మారిందట. కరోనా కారణంగా వాయిదా పడ్డ పూణే షెడ్యూల్ ఎప్పుడు మొదలుకానుందో తెలియని పరిస్థితి.

RRR Update, priyanka chopra, Alia Bhatt to quit rrr,alia bhatt,rrr movie,rrr,alia bhatt about rrr movie,alia bhatt in rrr movie,alia bhatt in rrr,alia bhatt rrr,alia bhatt movies,rrr movie trailer,rrr movie updates,rrr movie teaser,alia bhatt super comments on rajamouli and rrr movie,rajamouli about rrr movie,rrr teaser,alia bhatt about rajamouli,alia bhatt songs,rrr press meet,rrr movie songs,alia bhatt about rrr,aliaa bhatt about rrr,ఆర్ఆర్ఆర్ ,ఆలియా భట్ ఔట్‌,ఆలియా భట్, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఒలివియా మోరీస్
రాజమౌళి, ఆలియా భట్ Photo : Twitter


అది అలా ఉంటే.. ప్రస్తుతం బాలీవుడ్ లో పరిస్థితులు భట్ కుటుంబానికి వ్యతిరేకంగానే పరిణమిస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్ మొదలైన నెపోటిజం చర్చ.. రోజు రోజుకు తీవ్రమవుతోంది. అంతేకాదు సుశాంత్ మరణంలో మహేశ్ భట్ హస్తముందనే వార్తలు ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగానే కాదు, వృత్తిపరంగానూ దెబ్బతీస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా అలియా భట్, మహేష్ భట్‌ల సడక్ 2 సినిమా ట్రైలర్ య్యూట్యూబ్‌లో అత్యంత నిరాదరణ పొందినదిగా రికార్డు సృష్టించింది. ఈ పరిస్థితులు ఆలియా భట్ సినీ జీవితానని తీవ్రంగా దెబ్బతియనున్నాయి. ఇక తాజాగా రాజమౌళి RRRలో ఆమె పాత్ర చుట్టూ నీలినీడలు కమ్ముకున్నాయన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సినిమా నుంచి ఆమెను తప్పించారు అన్న వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. RRR‌లో ఆమె స్థానంలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా వచ్చిందనే వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ప్రియాంక ఇంతకు ముందు తుఫాన్ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆడిపాడిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ వార్తల్లో నిజమెంతో..

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోగా, పరిస్థితి ఓ కొలిక్కి రాగానే షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇంకా దాదాపు 30 శాతం షూటింగ్ పెండింగ్‌లో ఉంది. విడుదల తేది దగ్గరకు వస్తోంది. దీంతో ఆయన మరో ప్లాన్ వేశాడట. ఆర్ ఆర్ ఆర్ లో కొన్ని పాటలు తగ్గించే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో మొత్తంగా పదిపాటల వరకు ప్లాన్ చేసిందట చిత్రబృందం. అయితే అందులో కొన్ని పాటలను లేపేసి.. షూటింగ్ పూర్తి చేయాలనీ భావిస్తున్నాడట రాజమౌళి.
Published by: Suresh Rachamalla
First published: August 25, 2020, 1:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading