RRR : అంచనాలకు మించి తారక్ ఎంట్రీ.. కొమరం భీమ్‌గా అదరగొట్టిన ఎన్టీఆర్..

RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: October 22, 2020, 11:49 AM IST
RRR : అంచనాలకు మించి తారక్ ఎంట్రీ.. కొమరం భీమ్‌గా అదరగొట్టిన ఎన్టీఆర్..
భీమ్‌గా తారక్ Photo : Youtube
  • Share this:
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఈరోజు 11 గంటలకు ఆర్ ఆర్ ఆర్‌లో భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ విడుదలైంది. కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తున్న వారి అంచనాలకు తగ్గకుండా అంతే రీతిలో భీమ్‌గా ఎన్టీఆర్ అదరగొట్టాడు ఎన్టీఆర్. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయింది టీజర్. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉండనున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు పండగ వచ్చింది అనే చెప్పాలి. ఎన్టీఆర్ నటనకు తగ్గట్లు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అదిరింది. దీంతో ఆ టీజర్ చూస్తూ పరవశం చెందుతున్నారు అభిమానులు. ఇక ఎప్పుడో విడుదలకావాల్సిన ఈ టీజర్ కరోనా కారణంగా వాయిదా పడింది.


ఇక అల్లూరిగా చరణ్ ను ప్రెజెంట్ చేసిన టీజర్ కట్స్ లో అగ్ని జ్వాలాలతో చరణ్ ను చూపించారు. ఇప్పుడు అదే రీతిలో భీమ్ గా తారక్ ను చూపే టీజర్‌లో నీటికి ప్రతీకగా ఎక్కువ షాట్స్ ను చూపించారు. దీనికి కారణం ఉంది. సినిమా మొదట్లో ఈ ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగనుందని టాక్. అంతేకాకుండా వీరి మనస్తత్వాలు కూడా అయ్యి ఉండోచ్చు. ఒకరు నిప్పు అయితే.. మరోకరు నీరు.. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఓ ఐదు నెలలు వాయిదా పడింది.
Published by: Suresh Rachamalla
First published: October 22, 2020, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading