RRR UPDATE ALIA BHATT COMPLETES HER SHOOT AND LEAVES FOR MUMBAI HERE ARE THE DETAILS SR
RRR- Alia Bhatt : ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు గుడ్ బాయ్ చెప్పిన అలియా భట్.. ముంబైకి పయనం..
అలియా భట్ Photo : Instagram
RRR- Alia Bhatt : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా హైపును పెంచుతూ.. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఆ తర్వాత ఇటీవల భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ విడుదలైంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయింది టీజర్. ఎన్టీఆర్ నటనకు తగ్గట్లు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అదిరింది.
ఇక అది అలా ఉంటే కరోనా కారణంగా ఓ ఆరు నెలలు వాయిదా పడిన ఈసినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. అందులో భాగంగా 50రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఓ రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రారంభించింది చిత్రబృందం. ఈ చిత్రం కోసం ఓ వారం రోజులు ఉండే షెడ్యూల్ ను మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద ప్లాన్ చేశారు. దీనికి సంబందించిన ఓ షార్ట్ వీడియోను ఆర్ ఆర్ ఆర్ టీమ్ ట్విట్టర్లో తన ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఇక ఆ షెడ్యూల్ తర్వాత, బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవల ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ అయ్యింది. ఇప్పటికే ఆలస్యం కావడంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు టీమ్.
ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది. ఈ షెడ్యూల్లో ఆమెకు, రామ్ చరణ్ కు మధ్యన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతానికి ఆమె షూట్ ముగియడంతో అలియా భట్ హైదరాబాద్ నుండి ముంబై వెళ్లిపోయింది. మళ్ళీ ఆమె వచ్చే నెల నుండి కొత్తగా మొదలుకానున్న షెడ్యూల్లో పాల్గొననుంది. ఇక ఈ సినిమా ప్రధాన తారాగణం విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు 'ఆర్ఆర్ఆర్'తో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ టాలీవుడ్‌కు పరిచయమవుతుండగా, మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఒలీవియా మోరిస్, శ్రియా శరన్, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిపంచనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.