news18-telugu
Updated: July 16, 2020, 8:21 AM IST
రాజమౌళి Photo : Twitter
అగ్ర దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 70 శాతం వరకు పూర్తైన షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆర్ ఆర్ ఆర్‌ను అనుకున్న ప్లాన్ ప్రకారం 2021 జనవరి 8గా విడుదల చేయాలనీ ప్రకటించాడు. అయితే ఆ ప్లాన్ కరోనా కారణంగా తల కిందులైంది. లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలలుగా మూవీ షూటింగ్ ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు మొదలవుతుంది అనేది రాజమౌళి కూడా క్లారిటీ లేదు. దీనికి తోడు రోజు రోజుకు కేసులు ఎక్కువవుతుండటంతో ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశమే లేదు. అయితే ఇంకా దాదాపు 30 శాతం షూటింగ్ పెండింగ్‌లో ఉంది. విడుదల తేది దగ్గరకు వస్తోంది. దీంతో ఆయన మరో ప్లాన్ వేశాడు. ఆర్ ఆర్ ఆర్ లో కొన్ని పాటలు తగ్గించే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో మొత్తంగా పదిపాటల వరకు ప్లాన్ చేసిందట చిత్రబృందం. అయితే అందులో కొన్ని పాటలను లేపేసి.. షూటింగ్ పూర్తి చేయాలనీ భావిస్తున్నాడట రాజమౌళి. షూటింగ్ ఇప్పట్లో జరగదని భావించిన రాజమౌళి ప్రస్తుతం హైదరాబాద్ సిటీని వదిలి నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి సమీపంలో ఉన్న తన ఫార్మ్ హౌజ్‌కు వెళ్లాడు. ఇక షూటింగ్‌లు మొదలయ్యే వరకు తన మకాం అక్కడేనట. తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ తన తదుపరి సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పనుల్నీ చేసుకోనున్నాడు.
Published by:
Suresh Rachamalla
First published:
July 16, 2020, 8:19 AM IST