RRR UNIT ARRIVED THIRUVANANTHAPURAMFOR THE PRE RELEASE EVENT OF RRR AND THE 6 SHEET POSTERS OF MOVIE PLASTERED ALL OVER CITY TA
RRR : మలయాళంలో జోరుగా ఆర్ఆర్ఆర్ ప్రచారం.. అందరినీ ఆకర్షిస్తోన్నఆర్ఆర్ఆర్ భారీ పోస్టర్..
మలయాళంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ (Twitter/Photo)
RRR : బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా ఈ సినిమాను భారీ ఎత్తున పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. తాజాగా మలయాళంలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
RRR : బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా ఈ సినిమాను భారీ ఎత్తున పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్,అజయ్ దేవ్‌గణ్ (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఒణికిస్తోన్న ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా ఈ సినిమా విడుదలపై అనుమానులు వ్యక్తం అయినా.. తాజాగా అలాందేమి లేదని చిత్ర యూనిట్ మరోసారి స్పష్టం చేసింది.
పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ కాబోతుందనే వార్తలు వినిపించాయి. జనవరి 7న విడుదల కానున్న ట్రిపుల్ ఆర్కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరు మీద చేస్తున్నారు.తాజాగా హిందీలో అత్యంత ఫేమసైన కపిల్ శర్మ షోలో కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ పాల్గొంది. దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRR మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ (Twitter/Photo)
ఆర్ ఆర్ ఆర్ అనేది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్. తెలుగు మార్కెట్ రూ. 200 కోట్లు అయితే.. ఈ సినిమాకు హిందీ నుంచి వచ్చేది దాదాపు రూ. 300 కోట్లకు పైగానే. ఎందుకంటే బాహుబలి 2 సినిమా హిందీలో రూ. 800 కోట్లకు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర సహా మరో 5 రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్స్‌లో 50 శాతం ఆంక్షలు విధించారు. ఇక ఢిల్లీలో ఏకంగా థియేటర్స్ క్లోజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒమిక్రాన్ టెన్షన్ ఇప్పుడు దర్శక నిర్మాతలను టెన్షన్ పెడుతుంది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సరికొత్త ఆంక్షలు పెడుతున్నాయి. ఈ సమయంలో సినిమాను విడుదల చేయడం అంటే ఓ రకంగా చంపేసుకోవడమే అవుతుంది.
మరోవైపు చిత్ర యూనిట్ .. మలయాళంలో కూడా జోెరుగా ప్రచారం నిర్వహిస్తోంది. అక్కడ తిరువనంత పురంలో ఆరు షీట్ల ఆర్ఆర్ఆర్ భారీ కటౌట్ సిటీ మొత్తం దర్శనమిస్తోంది. అజయ్ దేవ్‌గణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, ఆలియా భట్, ఆర్ఆర్ఆర్తో కూడిన పోస్టర్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా ఓమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తోన్న తమ సినిమా విడుదల విషయంలో ఎలాంటి భయం లేకుండా తమ పని చేసుకుంటూ పోతున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ భారీ కటౌట్స్ (Twitter/Photo)
ఈ మూవీ కేవలం భారత దేశంలోనే కాకుండా.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్స్ టికెట్స్ రూపంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్‌తోనే 1 మిలియన్ యూఎస్ డాలర్స్‌ను దాటేసింది.ఒక ఫస్ట్ డే ఆర్ఆర్ఆర్ యూఎస్‌తో పాటు మిగతా ఓవర్సీస్ మార్కెట్లో ఏ మేరకు సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఇంకా 15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అయితే.. యూఎస్ లాంటి ఓవర్సీస్ మార్కెట్లో ప్రేక్షకులకు ఒకటిన్నర రెట్లు కాంపన్సెసన్ కట్టాల్సి ఉంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్.. జనవరి 7 విడుదలకే మొగ్గు చూపుతోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.