RRR TO SCREEN ON JUNE 1 IN 100 PLUS US THEATERS IN ITS ORIGINAL UNCUT VERSION HERE ARE THE DETAILS SR
RRR : ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒరిజనల్ కట్‌తో ఒక్క రోజు మాత్రమే..
RRR మూవీ (Twitter/Photo)
RRR : ఈ సినిమా మరోసారి అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమా జూన్ 1 న ఒక్కరోజు 100 థియేటర్స్‌లో విడుదలకానుంది. అసలైన అన్‌కట్ తెలుగు వెర్షన్‌ను ప్రదర్శించనున్నారట. అన్‌కట్ వెర్షన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్స్ కూడా ఉండనుందట.
RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొట్టింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాధించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా U.S. సినీ ప్రేక్షకులకు మరోసారి అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమా జూన్ 1 న ఒక్కరోజు 100 థియేటర్స్‌లో విడుదలకానుంది. అంతేకాదు అక్కడి ప్రేక్షకుల కోసం అసలైన అన్‌కట్ తెలుగు వెర్షన్‌ను ప్రదర్శించనున్నారట. అన్‌కట్ వెర్షన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్స్ కూడా ఉండనుందట.\
ఇకవైపు మే 20న ఈ సినిమా పే ఫర్ వ్యూ పద్దతిన జీ5లో స్ట్రీమింగ్ రానుంది. అంటే సినిమా చూడాలంటే పే చేయాలన్న మాట. సబ్స్క్రైబర్స్ 100 రూపాయలు పే చేయాలన్నమాట. ఇక కొత్తగా వచ్చేవారు మాత్రం 699 చెల్లించాలని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.