RRR: అభిమానులకు ఆర్ఆర్ఆర్ టీమ్ స్పెషల్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..

అభిమానులకు RRR టీమ్ స్పెషల్ వీడియో (Twitter/Photo)

RRR: ప్రస్తుతంమన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సందర్భంగా అభిమానులు, ప్రజలను ఉద్దేశిస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసారు.

  • Share this:
    RRR: ప్రస్తుతంమన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎంతో మంది నటీనటులు కోవిడ్ బారిన పడుతున్నారు. మరోవైపు సామాన్యులు మాత్రం సరైన వైద్య సదుపాయాలు లేక కోవిడ్‌తో ప్రాణాలు వదులుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్.. దేశ వ్యాప్తంగా అందరు ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్‌తో పాటు చిత్ర దర్శకుడు రాజమౌళి అందరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాంటూ వివిధ భాషల్లో మాట్లాడారు. అజయ్ దేవ్‌గణ్ హిందీలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలందరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు తమ కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో ఆలియా భట్.. తెలుగులో అందరికీ నమస్తే.. అంటూ చెప్పుకొచ్చింది.

    మరోవైపు రామ్ చరణ్ తమిళంలో ప్రజలందరు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, రాజమౌళి కన్నడలో వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తన సినిమా ప్రమోషన్‌తో పాటు సామాజిక బాధ్యతగా అందరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపు నివ్వడం ఆనందించదగ్గ పరిణామం. వీళ్ల సందేశం మాస్ జనాల్లో బాగా వెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ టీమ్ సామాజిక బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపు నివ్వడం సోషల్ మీడియాలో ఆయా హీరోల అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.


    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) సినిమా విషయానికొస్తే.. ఎన్టీఆర్, చరణ్‌,   హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను ఓ శిల్పం చెక్కినట్టు తెరకెక్కిస్తున్నారు.

    pen movies acquired the North India Distribution Rights, Ram Charan Birth day gift, Nick Powell Ram charan ntr RRR new Release Date confirmed officially announced, RRR Release Date leaked, English actor alison doody leaks the rrr release date, RRR update, ntr news, ntr intro,RRR update,Ntr as Komaram Bheem look,RRR fight secens,RRR news,RRR ntr fight,RRR leaks,ఆర్ ఆర్ ఆర్ లీక్స్, రాజమైమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, charan intro,charan rrr intro, ntr rrr intro rrr release date
    RRR Poster : Twitter


    ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.మరి సెకండ్ వేవ్ అప్పటి వరకు తగ్గితే.. అదే తేదిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే.. వచ్చే యేడాది సంక్రాంతికి  ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్ జోడిగా శ్రియా సరన్ కథానాయికగా నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: