Jr NTR Injury: జూనియర్ ఎన్టీఆర్ కంటి దగ్గర గాయం.. క్లారిటీ ఇచ్చిన ‘RRR’ టీమ్..

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ (Jr NTR Ram Charan)

Jr NTR Injury: ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా విడుదలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. అందుకే ప్రమోషన్ కోసం తన సినిమాకు సంబంధించిన విజువల్స్ అప్పుడప్పుడూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

  • Share this:
ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. అందుకే ఇప్పట్నుంచే ప్రమోషన్ మొదలు పెట్టాడు దర్శకుడు రాజమౌళి. తన సినిమాకు సంబంధించిన విజువల్స్ అప్పుడప్పుడూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడలో ఒకేరోజు విడుదల కానుంది ట్రిపుల్ ఆర్. అన్ని భాషలకు సంబంధించిన నటీనటులు ఇందులో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుగుతుంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా రాజమౌళి చేస్తున్న ఫిక్షనల్ కథ ఇది. చరిత్రలో వాళ్లిద్దరూ కలిసినట్లు ఎక్కడా లేదు. ఒకవేళ ఆ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. చాలా మంది అనుకుంటున్నట్లు ఇది దేశభక్తి సినిమా కాదు.. ప్యూర్ కమర్షియల్ ఫ్రెండ్ షిప్ డ్రామా.

అందులో దేశభక్తి కూడా ఉంటుంది కానీ దేశభక్తే మొత్తం ఉండదు. షూటింగ్ విరామంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ ముచ్చట్లను రాజమౌళి తన కెమెరాలో బంధించాడు. ఈ దృశ్యాలను విడుదల చేసారు. అయితే ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ కంటిపై ఓ గాయం కనిపిస్తుంది. దాంతో అభిమానులు కంగారు పడ్డారు. మరీ ప్రత్యేకంగా ఈ దెబ్బకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. దాంతో దీనిపై ట్రిపుల్ ఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

ఎన్టీఆర్ కను బొమ్మపై ఉన్నది నిజం గాయం కాదని.. షూటింగ్ కోసమే పెట్టామని చెప్పారు దర్శక నిర్మాతలు. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. అది మేకప్ అని క్లారిటీ ఇచ్చింది. సినిమా షూటింగ్‌లో భాగంగానే ఎన్టీఆర్ అలా గాయంతో కనిపించాడని తెలిసిన తర్వాత అభిమానులు కూల్ అయ్యారు. ఈ సినిమాను 350 కోట్లతో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మొత్తానికి ఎన్టీఆర్‌కు దెబ్బ లేదని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు అభిమానులు.
Published by:Praveen Kumar Vadla
First published: