నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు తీసుకొని చరిత్ర సృష్టించిన RRR టీమ్ హైదరాబాద్ కు తిరిగొచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామున దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాలభైరవ తదితరులు శంషాబాద్ విమానాశ్రయంలో సందడి చేశారు. రాజమౌళి టీమ్ మొత్తానికి ఘన స్వాగతం పలికారు తెలుగు ప్రేక్షక లోకం.
పలువురు కుటుంబ సభ్యులతో వచ్చిన వీరికి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. తెల్లవారుజామున కూడా అభిమానులు, మీడియా ప్రతినిధులు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో ఉన్న పలువురు రాజమౌళి , కీరవాణితో సెల్ఫీలు దిగారు. అయితే జైహింద్ అంటూ నినాదాలు చేస్తూ మీడియాతో మాట్లాడకుండానే రాజమౌళి వెళ్లిపోయారు. జాతీయ మీడియాతో మాట్లాడిన కాలభైరవ.. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ పాటను లైవ్ లో పాడటం తన జీవితంలోనే గొప్ప క్షణం అన్నారు. ఆస్కార్ అవార్డు సాధించడం తన జీవితంలో మరపురాని సందర్భం అని చెప్పారు.
శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకి రాజమౌళి, ఆయన భార్య రమా, కీరవాణి, ఆయన భార్య వల్లి, కార్తీకేయ, కాలభైరవ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకోగా.. రామ్ చరణ్ మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారట. ఈ విషయం తెలిసి ముందే తెలిసి పలువురు ఫ్యాన్స్ విమానాశ్రయం చేరుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Prime minister @narendramodi invited #RrR "lead" actor @AlwaysRamCharan today and going to meet him congratulations to Oscar winner ???? pic.twitter.com/Biu7B6ObrI
— ????GHANI BHAI بهاي???? (@BheemlaBoy1) March 17, 2023
పలు రికార్డులు సొంతం చేసుకుంటున్న RRR అంతర్జాతీయ వేదికలపై ప్రభంజనం సృష్టిస్తుండటం సగటు భారతీయ ప్రేక్షకుడిలో పట్టలేని ఆనందం నింపుతోంది. తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటుతుండటం పట్ల ఖుషీ అవుతున్నారు ఆడియన్స్.
RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ .. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ టచ్ ఉండేలా ఈ సినిమా కథ రాసుకున్న కొరటాల.. ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ద పెట్టారట. మరోవైపు రామ్ చరణ్ తన తదుపరి సినిమాకు చకచకా కంప్లీట్ చేస్తున్నారు. RC15 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: M. M. Keeravani, RRR, SS Rajamouli