RRR: కొంచెం చరిత్ర... కొంచెం ఊహ... అదే రాజమౌళి RRR కథ

RRR: భిన్నమైన కథలను ఎంచుకుని వాటిని ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించడంలో తన తరువాతే ఎవరైనా అని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి... మరోసారి అలాంటి తరహా స్టోరీనే ఎంచుకుని ప్రయోగం చేస్తున్నారు.

news18-telugu
Updated: March 14, 2019, 12:41 PM IST
RRR: కొంచెం చరిత్ర... కొంచెం ఊహ... అదే రాజమౌళి RRR కథ
RRR పోస్టర్ (‘RRR’ Twitter)
  • Share this:
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా ఉంటుందనే దానిపై వస్తున్న ఊహాగానాలకు చిత్ర యూనిట్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ సినిమా స్టోరీ ఏంటి ? ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు ఎలా ఉంటాయనే దానిపై స్పష్టత ఇచ్చిన రాజమౌళి... ఇది పిరియాడికల్ స్టోరీ అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఆదివాసీల కోసం పోరాడిన కొమరం భీమ్, ఏపీలో ఆదివాసీల సంక్షేమం, స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రలే స్పూర్తిగా ఈ సినిమా తెరకెక్కుతుందని... కొమరం భీమ్ స్పూర్తితో ఎన్టీఆర్ పాత్ర, అల్లూరి సీతారామరాజు స్పూర్తిగా రామ్‌చరణ్ పాత్ర ఉంటుందని రాజమౌళి వెల్లడించారు.

భిన్నమైన కథలను ఎంచుకుని వాటిని ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించడంలో తన తరువాతే ఎవరైనా అని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి... మరోసారి అలాంటి తరహా స్టోరీనే ఎంచుకుని ప్రయోగం చేస్తున్నారు. కథకు తగ్గట్టుగానే ఇద్దరు స్టార్ హీరోలను ఎంపిక చేసుకున్న జక్కన్న... ఈ సారి చరిత్రపై కూడా ఎక్కువగా రీసెర్చ్ చేసినట్టు స్వయంగా చెప్పారు. అందుకే కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితచరిత్రలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందనే ఊహతోనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పిన రాజమౌళి... సినిమా కథలో కొంచెం చరిత్ర, కొంచెం ఊహ కలగలిపి ఉంటుందనే విషయంలోనూ పూర్తి స్పష్టత ఇచ్చారు.

బాహుబలి సినిమాతోనే జాతీయస్థాయిలో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి... ఆర్ఆర్ఆర్ సినిమా కథాంశం కూడా దేశమొత్తానికి నచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే స్వాతంత్ర ఉద్యమం నేపథ్యాన్ని ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. సినిమా ఏదైనా... భారీ స్థాయిలో తెరకెక్కించే దర్శకధీరుడు... ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తానని చెప్పారు. మరి... కొంచెం చరిత్ర, కొంచెం ఊహ కలగలిపి ఉండబోయే ఆర్ఆర్ఆర్‌ను జక్కన్న అందరికీ నచ్చే విధంగా చెక్కుతారనడంలో సందేహాలు అవసరం లేదు. అయితే సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం జూలై 30, 2020 వరకు ఎదురుచూడాల్సిందే.




First published: March 14, 2019, 12:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading