Home /News /movies /

RRR STAR RAM CHARAN SPECIAL CALL FROM DUBAI PRINCE FOR DINNER SB

Ram Charan: ఇంతవరకు ఏ హీరోకు దక్కని అవకాశం రామ్ చరణ్‌కు దక్కనుందా?

ఆర్ఆర్ఆర్ తెర వెనక కహాని (NTR Ram Charan RRR Movie Photo : Twitter)

ఆర్ఆర్ఆర్ తెర వెనక కహాని (NTR Ram Charan RRR Movie Photo : Twitter)

ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ పాత్రపై పెద్ద చర్చే నడుస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ఆర్ఆర్ఆర్ (RRR)సినిమా అందులో నటించిన వారి జీవితాల్ని మార్చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా అద్భుతమైన విజయం దక్కించుకుంది. ఈ సినిమాపై అనేక దేశాలకు చెందిన వారు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్‌ను ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరైన దుబాయ్ రాజు( Dubai Shaik) కూడా ప్రశంసించారు. ఈ సినిమా చూసిన ఆయన అందులో చరణ్ పాత్రకు ఫిదా అయిపోయారు. చరణ్‌ను కలవాలని ఆయన కోరుకుంటున్నారు. దుబాయ్ రాజుతో మీటింగ్ అంటే మామూలు మాట కాదు. అనేక దేశాధినేతలు, రాజులు ఆయనతో ఒక్క అపాయింట్ మెంట్ కోసం ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తుంటారు. అలాంటిదే ఆయనే.. రామ్ చరణ్‌తో మీటింగ్ ఫిక్స్ చేశారు.

    దుబాయ్ రాజు…కి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. జీవితాన్ని… రాయల్టీ గా బతకాలంటే.. ప్రస్తుత యుగంలో దుబాయ్ రాజు తర్వాతే.. ఎవరైనా అని చెప్పవచ్చు. అటువంటి దుబాయ్ రాజు ప్రపంచంలో ఏ హీరోకి ఇవ్వని అవకాశం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ఇచ్చినట్లు లేటెస్ట్ టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “ఆర్ఆర్ఆర్” (RRR) సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక దుబాయ్ లో కూడా నిర్వహించారు. దీంతో దుబాయ్ రాజు “ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ కి గ్రాండ్ పార్టీ ఇవ్వడం జరిగిందట. అయితే “ఆర్ఆర్ఆర్” విడుదల అయ్యాక.. దుబాయ్ రాజు ఇటీవల స్పెషల్ షో వేయించుకుని మరీ చూశారట. దీంతో ఆసినిమాలో రామ్ చరణ్(Ram Charan) తేజ్ పాత్ర దుబాయ్ రాజు కి బాగా నచ్చినట్లు టాక్.

    దీంతో రామ్ చరణ్ తో డిన్నర్ పార్టీ దుబాయ్ రాజు ఏర్పాటు చేసినట్లు త్వరలోనే చరణ్ దుబాయ్ వెళ్లనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రల్లో చరణ్ నటన “ఆర్ఆర్ఆర్” లో హైలెట్ గా నిలిచింది. “ఆర్ఆర్ఆర్” (RRR) సినిమా ప్రారంభం టైం లో చరణ్ తో పాటు ఎన్టీఆర్.. అనేసరికి ఖచ్చితంగా ఎన్టీఆర్ హైలెట్ అవుతాడు.. చెర్రీ డౌన్ అవుతాడు అని అందరూ భావించారు. కాని తారక్ కి తగ్గ రీతిలో చరణ్ కూడా అల్లూరి సీతారామరాజు పాత్రలో అందర్నీ కట్టిపడేశాడు. ఈ క్రమంలో దుబాయ్ రాజు కి కూడా సినిమాలో చెర్రీ క్యారెక్టర్ నచ్చటం .. చరణ్ నటనకు దుబాయ్ రాజు ఫిదా అవ్వడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మరి చెర్రీ దుబాయ్ పర్యటన ఎప్పుడని? ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Dubai, Ram Charan, RRR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు