news18-telugu
Updated: August 28, 2019, 10:27 AM IST
RRR మూవీ ప్రెస్ మీట్
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలోనే క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది ఆర్ఆర్ఆర్. పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజమౌళి దర్శకుడు కావడం.. బాహుబలి సిరీస్ తర్వాత సినిమా కావడంతో అంచనాలు ఆకాశమే హద్దుగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎమ్మా రాబర్ట్స్‌ను తీసుకుంటున్నారు. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సింది. ఈ సినిమాలో తారక్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తే.. రామ్ చరణ్... అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమాలో అల్లూరు సీతారామరాజుకు సంబంధించిన ప్రీలుక్‌ను రిలీజ్ చేసారు. నేరుగా ముఖం చూపించలేదు కానీ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పోస్టర్ విడుదల చేసాడు జక్కన్న.

అల్లూరిగా రామ్ చరణ్ (Source: Twitter)
ప్రస్తుతం రామ్ చరణ్ మాత్రం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు సంబంధించి పనుల్లో తలమునకలై ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా ఉన్న ఫైటింగ్ దృష్యాలను చిత్రీకరించే పనిలో ఉన్నాడు రాజమౌళి. తాజాగా బల్గేరియాలో కొంత మంది హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ నేపథ్యంలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరిస్తున్నారు. దీని కోసం తారక్ .. ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. సెప్టెంబర్ మొదటి వారం వరకు ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరంచనున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొమరం భీమ్ లుక్‌ను అక్టోబర్ 22న కొమరం భీమ్ జయంతి రోజున విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. హిస్టరీలో ఎన్నడు కలుసుకొని ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలుసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న విడుదల చేయనున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 28, 2019, 10:27 AM IST