RRR - Sadhguru jaggi vasudev : దర్శక బాహుబలి రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ మన దేశ ప్రేక్షకులనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం జక్కన్న మాయాజాలానికి ఫిదా అయ్యారు. ఈ సినిమా కమర్షియల్‌గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు అవార్డులను గెలుస్తూ దూసుకుపోతుంది. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan), హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాపై వరల్డ్ వైడ్ స్టార్స్ ప్రశంసలు గుప్పించారు. దేశవిదేశాల్లో RRR ఎన్నో అవార్డులను కొల్లగొడుతూనే ఉంది. ఈ భారీ సినిమాతో మరోసారి తెలుగోడి సత్తా ఎల్లలు దాటింది. ముఖ్యంగా ఈ సినిమాలోని సాంగ్స్, అందునా నాటు నాటు సాంగ్.. ఈ సాంగ్ లోని స్టెప్స్ ప్రపంచ దిగ్గజాల మెప్పు పొందాయి. ఎందరో ఈ పాటను అనుకరిస్తూ స్టెప్పులేయడం చూశాం.
రీసెంట్ గానే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ సాంగ్.. ఇప్పుడు ఆస్కార్ కోసం నామినేట్ కావడం మరో ఆసక్తికర అంశం. అయితే తాజాగా ఈ సాంగ్ ఫీవర్ ఇండియాలోని సౌత్ కొరియన్ ఎంబసీని తాకింది. ఎంబసీలోని సిబ్బంది అంతా ‘నాటు నాటు’ పాటకు కాలు కదిపారు. సిబ్బందితో కలసి దౌత్యవేత్త చాంగ్ జే బోక్ (Chang Jae-bok) డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ డాన్స్ పై ప్రధాని మోదీ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక సద్గురు జగ్గదేవ్ నాటు నాటు పాటకు ప్రపంచమే తాండవం చేస్తోంది. అంటూ కొరియన్ ఎంబసీ వాళ్లు నాటు నాటు పాటకు డాన్స్ స్టెప్స్ వేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు.
World dances to Naatu Naatu! Congratulations to the #RRR team and to the Ambassador of the Republic of Korea & his team for shaking their leg to Naatu Naatu! -Sg @RokEmbIndia@AlwaysRamCharan @tarak9999 @ssrajamouli https://t.co/s2MWiSEpai
— Sadhguru (@SadhguruJV) February 28, 2023
గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 1215 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా జపాన్‌లో ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు పలువురి ప్రశంసలతో పాటు అవార్డుల పంట పండింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన కన్నుల పండగ అయింది. కీరవాణి మ్యూజిక్, రాజమౌళి టేకింగ్ అబ్బురపరిచాయి. అజయ్ దేవగణ్, శ్రియ స్పెషల్ రోల్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇండియాతో పాటు పలు దేశాల్లో RRR హవా నడిచింది.ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులతో పాటు పలు అవార్డులకు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలో ఆస్కార్ అవార్డు కూడా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Rahul Sipligunj and Kaala Bhairava. “Naatu Naatu." LIVE at the 95th Oscars. Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/8FC7gJQbJs
— The Academy (@TheAcademy) February 28, 2023
ఇక 95వ ఆస్కార్ అవార్డుల భాగంగా నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఉండనుంది. అక్కడ రాహుల్ సిప్లిగంజ్, కాల బైరవ ఈ పాట పాడనున్నారు. ఏది ఏమైనా ఒక తెలుగు వాడు తెరకెక్కించిన చిత్రం ప్రపంచ సినీ వేదికపై మెరవడం మాములు విషయం కాదనే చెప్పాలి. మరి ఆస్కార్ అవార్డుల్లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు సాధించి ఆర్ఆర్ఆర్ మూవీ చరిత్ర సృష్టించబోతుందా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Oscar 2023, Rajamouli, Ram Charan, RRR, Sadhguru Jaggi Vasudev, Tollywood